Nani: ఆ విషయం లో చిరంజీవి, బాలయ్య లతో పోటీపడిన ఒకే ఒక యంగ్ హీరో నాని…

.ఇక సీనియర్ ఎన్టీయార్ నుంచి ఇప్పుడున్న నాని వరకు చాలా మంది కి ఇదే రకమైన ప్రాబ్లమ్ ఎదురైంది ఆ హీరో లు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..? అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

  • Written By: Neelambaram
  • Published On:
Nani: ఆ విషయం లో చిరంజీవి, బాలయ్య లతో పోటీపడిన ఒకే ఒక యంగ్ హీరో నాని…

Nani: సినిమా ఇండస్ట్రీ లో సినిమాల మధ్య పోటీ అనేది ఉండటం సహజం… హీరోల మధ్య సినిమాల రిలీజ్ విషయం లో చాలా రకాలైన పోటీ లు ఉంటాయి.అలా ఉండటం కూడా కామనే ఎందుకంటే సినిమా అనేది బిజినెస్ కాబట్టి సినిమాని రైట్ టైం లో రిలీజ్ చేయాలనీ ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆశపడుతూ ఉంటాడు.ఎందుకంటే ఆయన కి సినిమా ల మీద డబ్బులు రావడమే ఆయన గోల్ కాబట్టి సినిమా బాగా ఆడితేనే సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తాయి…అలా డబ్బులు వస్తే చాలు అనే విషయం గానే ప్రొడ్యూసర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అందుకే సినిమాలని ఎక్కువ జనం ఎప్పుడైతే చూడటానికి ఇంట్రెస్ట్ గా ఉంటారో అప్పుడే సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు.అయితే దానికి పోటీ గా వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి దాని వల్ల రెండు సినిమాల మధ్య మంచి పోటీ ఉంటుంది.అయితే ఒకే రోజు ఒక హీరో కి సంభందించిన రెండు సినిమాలు రిలీజ్ అయితే ఆ హీరో సినిమాలకే పోటీ అనేది ఉంటుంది…ఇక సీనియర్ ఎన్టీయార్ నుంచి ఇప్పుడున్న నాని వరకు చాలా మంది కి ఇదే రకమైన ప్రాబ్లమ్ ఎదురైంది ఆ హీరో లు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..? అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ముందు గా సీనియర్ ఎన్టీయార్ హీరో గా వచ్చిన సంపూర్ణ రామాయణం, అప్పు చేసి పప్పు కూడు సినిమాలు రెండు కూడా ఒకే రోజు అంటే 1959 జనవరి 14 వ తేదీన రిలీజ్ అయ్యాయి…అలాగే 1961 లో సతి సులోచన, పెండ్లి పిలుపు అనే రెండు సినిమాలు కూడా 1961 మే 5 వ తేదీన రిలీజ్ అయ్యాయి…

శోభన్ బాబు హీరో గా వచ్చిన సినిమాల్లో లక్ష్మి నివాసం, పంతాలు పట్టింపులు అనే రెండు సినిమాలు కూడా 1968 జులై 19 వ తేదీన రిలీజ్ అయ్యాయి…

ఇక కృష్ణ హీరో గా వచ్చిన ఇద్దరు దొంగలే, యుద్ధం సినిమాలు రెండు కూడా 1984 జనవరి 14 న రిలీజ్ అయ్యాయి…

చిరంజీవి హీరో గా వచ్చిన కాళీ, తాతయ్య ప్రేమ లీలలు సినిమాలు రెండు కూడా 1980 సెప్టెంబర్ 19 వ తేదీన రిలీజ్ అయ్యాయి.
అలాగే పట్నం వచ్చిన పతివ్రతలు,టింగు రంగడు 1982 అక్టోబర్ 1 వ తేదీన రిలీజ్ అయ్యాయి…

ఇక బాలకృష్ణ హీరో గా వచ్చిన నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు కూడా 1993 సెప్టెంబర్ 3 వ తేదీన రిలీజ్ అయ్యాయి…

ఇక నాని హీరో గా వచ్చిన జండా పై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు కూడా రెండు ఒకే రోజు అంటే 2015 మార్చ్ 21 వ తేదీన రిలీజ్ అయ్యాయి..

ఈ రోజుల్లో సంవత్సరానికి ఒక్క సినిమా రిలీజ్ చేయడమే కష్టం అవుతుంటే, అప్పట్లో వాళ్ళు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…అయితే ఈ జనరేషన్ లో ఉన్న నాని సినిమాలు రెండు ఒకే రోజు ఎలా వచ్చాయి అది ఎలా సాధ్యం అయింది అంటే జండా పై కపిరాజు సినిమా అప్పటికి ఎప్పుడో సినిమా పూర్తి అయి పోయి రిలీజ్ కి కూడా రెడీ గా ఉంది. కానీ కొన్ని వివాదాల వల్ల ఈ సినిమా రిలీజ్ కొంచం లెట్ అవుతూ వచ్చింది.అందువల్లే ఈ సినిమా ఎవడే సుబ్రమణ్యం తో పాటు గా రిలీజ్ అయింది.అయితే ఎవడే సుబ్రహ్మణ్యం హిట్ అయితే జండా పై కపిరాజు ప్లాప్ అయింది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు