
Nani
Nani: హీరో నానికి టాలీవుడ్ మీద ఏదైనా అసహనం ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. దసరా మూవీ విజయం మీద ఆయనకు ఎంత నమ్మకం ఉందో తెలియదు కానీ, దారుణమైన యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. తన మాటల్లో కొందరిని కించపరుస్తున్న భావన కనపడుతుంది. దసరా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న నాని చేసిన కామెంట్ దర్శకుడు సుకుమార్ స్థాయి తగ్గించినట్లు అయ్యింది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కదా… అని మీడియా అడిగిన ప్రశ్నకు నాని పుష్ప, సుకుమార్ ప్రస్తావన తెచ్చారు.
పుష్ప మూవీ సక్సెస్ అయ్యే వరకు దర్శకుడు సుకుమార్ టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే మిగతా భాషలు, రాష్ట్రాల్లో తెలియదు కదా అన్నారు. పుష్ప అనే సినిమా తీయకపోతే, అది ఆడకపోతే సుకుమార్-శ్రీకాంత్ ఓదెల ఒకటే అన్నట్లు ఆయన వాదన ఉంది. సుకుమార్ తీసింది తక్కువ చిత్రాలే అయినా తన మార్క్ క్రియేట్ చేశారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలతో సుకుమార్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. ఆయనకు పరాయి భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు.
తాజాగా తోటి హీరోలను టార్గెట్ చేస్తూ నాని మరో కామెంట్ చేశాడు. ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ నాని చెప్పిన సమాధానం మిగతా స్టార్స్ ని కించపరిచేదిగా ఉంది. ఓ యాంకర్ నానిని దసరా చిత్రం కోసం జుట్టు పెంచినట్లున్నారు. మీది ఒరిజినల్ జుట్టేనా? అని అడిగింది. దానికి 100% ఒరిజినల్ అండి. ఇదే క్వశ్చన్ అందరు హీరోలను అడకండి అన్నారు. ఇది టైమింగ్ జోక్ లా ఉన్నా ఇతర హీరోల జుట్టు ఒరిజినల్ కాదని సెటైర్ వేసినట్లు అయ్యింది.

Nani
నా జుట్టు ఒరిజినల్ అంటే సరిపోతుంది. మిగతా హీరోలను ఇలా అడగొద్దని నాని అన్నారు. వివిధ కారణాలతో జుట్టు పోయి విగ్గులను ఆశ్రయిస్తున్న హీరోలపై నాని దారుణమైన జోక్ వేశారు. చూస్తుంటే నాని అనాలోచిత కామెంట్స్ చేసి, వివాదాలలో చిక్కుకుంటున్నారని అనిపిస్తుంది. ఆయన లేటెస్ట్ మూవీ దసరా పాన్ ఇండియా మూవీగా ఐదు బాధల్లో విడుదల చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్స్ లోకి వస్తుంది.
https://twitter.com/PavanJspk_/status/1636960607995064323