Balakrishna Son Mokshagna: బాలయ్య చెప్పడమే కానీ మోక్షజ్ఞ ముందుకు రావడం లేదే!
ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సబ్జెక్టుతో మోక్షజ్ఞ లాంచ్ బాగుంటుందని భావిస్తున్నాము. ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తాడని వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత ఉంటుందన్నారు. దీంతో ఈసారైనా బాలయ్యను నమ్మొచ్చా అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మోక్షజ్ఞ ఇటీవల స్లిమ్ అయ్యారు. బరువు తగ్గి హ్యాండ్సమ్ లుక్ సాధించాడు.

Balakrishna Son Mokshagna: నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ లో మోక్షజ్ఞ హీరో కావాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. సాధారణంగా ఇరవై ఏళ్ళు దాటితే చాలు స్టార్ కిడ్స్ పరిశ్రమలో అడుగుపెట్టేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే పదిహేడేళ్లకే హీరో అయిపోయాడు. మూతి మీద మోసం మొలవక ముందే మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. బాలయ్య వారసుడు మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు.
మోక్షజ్ఞ ప్రస్తుత వయసు 28 ఏళ్లు. అంటే టూ లేట్. గత ఐదేళ్లు బాలయ్య మీద ఫ్యాన్స్ బాగా ఒత్తిడి తెస్తున్నారు. మోక్షజ్ఞను హీరో చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మోక్షజ్ఞలో హీరో అయ్యే కాంక్ష రగిలించేలా భారీ ఎత్తున బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ప్రకటన చేస్తున్నారు. కానీ ఆయన మాటలు కార్యరూపం దాల్చడం లేదు. తాజాగా మరోసారి స్పందించారు.
ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సబ్జెక్టుతో మోక్షజ్ఞ లాంచ్ బాగుంటుందని భావిస్తున్నాము. ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తాడని వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత ఉంటుందన్నారు. దీంతో ఈసారైనా బాలయ్యను నమ్మొచ్చా అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మోక్షజ్ఞ ఇటీవల స్లిమ్ అయ్యారు. బరువు తగ్గి హ్యాండ్సమ్ లుక్ సాధించాడు.
ఇది సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ప్రిపరేషన్ లో భాగమే అంటున్నారు. గతంలో నటుడు కావడం మోక్షజ్ఞకు ఇష్టం లేదు. అందుకే బాలయ్య బ్రతిమిలాడినా ఒప్పుకోవడం లేదంటూ ప్రచారం జరిగింది. మరోవైపు బాలకృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి మూవీ చేస్తుండగా, దసరా కానుకగా విడుదల కానుంది. త్వరలో దర్శకుడు బాబీతో ప్రకటించిన 109వ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.