Nandamuri Balakrishna: విమానం లో పరిచయమైనా అభిమాని కోసం నేరుగా ఇంటికే వచ్చేసిన నందమూరి బాలకృష్ణ!
ఇప్పుడు రీసెంట్ గా మరో అభిమాని కోరిక తీర్చాడు బాలయ్య బాబు, ఇటీవల కాలం లో షూటింగ్ కి విమానం లో వెళ్తున్న సమయం లో ఒక అభిమాని పరిచయం అయ్యాడు. అతని పేరు హరీష్ రావు, అతని మాట , మర్యాద బాలయ్య బాబు కి ఎంతగానో నచ్చింది. రీసెంట్ గానే ఆయన బాలయ్య ని కలిసి తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నానని, మీరు గృహప్రవేశానికి విచేస్తే చాలా సంతోషిస్తాము అంటూ బాలయ్య బాబు ని ఆహ్వానించాడట.

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ మరియు ఆయన వ్యక్తిత్వం గురించి తెలియని వాళ్లంటూ ఉండరు, ఆయన మనసు చిన్న పిల్లల మనస్తత్వం, బయట ఫ్యాన్స్ మీద రెండు మూడు సార్లు ఆయన కోపం లో చెయ్యి చేసుకోవడం చూసి బాలయ్య చాలా మొరటోడు , అహంకారం ఎక్కువ అని అందరూ అనుకునేవాళ్లు. కానీ ఆయన ఎంత మంచోడో, అందరితో ఎంత స్నేహం గా ఉండేవాడో, రీసెంట్ టైం లో జరిగిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ ప్రోగ్రాం ద్వారా తెలిసింది.
ఇక ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా సోషల్ మీడియా ద్వారా మెల్లగా ఒక్కొక్కటి బయటకి వచ్చాయి. అప్పటి నుండి బాలయ్య ని ద్వేషించే వాళ్ళు కూడా అభిమానించడం ప్రారంభించారు. ఇక బాలయ్య కేవలం తన తోటి హీరోలతో మాత్రమే కాదు, అభిమానులతో కూడా ఎంతో స్నేహంగా మెలుగుతాడు. రీసెంట్ గా ఒక అభిమాని ఆహ్వానం ని మన్నించి అతని ఇంటికి అతిథిగా లంచ్ కోసం వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు రీసెంట్ గా మరో అభిమాని కోరిక తీర్చాడు బాలయ్య బాబు, ఇటీవల కాలం లో షూటింగ్ కి విమానం లో వెళ్తున్న సమయం లో ఒక అభిమాని పరిచయం అయ్యాడు. అతని పేరు హరీష్ రావు, అతని మాట , మర్యాద బాలయ్య బాబు కి ఎంతగానో నచ్చింది. రీసెంట్ గానే ఆయన బాలయ్య ని కలిసి తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నానని, మీరు గృహప్రవేశానికి విచేస్తే చాలా సంతోషిస్తాము అంటూ బాలయ్య బాబు ని ఆహ్వానించాడట.
బాలయ్య బాబు అందుకు అంగీకరించి నేడు గృహ ప్రవేశానికి విచ్చేసి ఆ అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. బాలయ్య వ్యహరించిన ఈ తీరుకి అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేస్తున్నాడు, ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.