Balakrishna- Sreeleela: సెట్స్ లో శ్రీలీల చెంప చెళ్లుమనిపించిన బాలయ్య!
అయితే ఇక్కడ బాలయ్య నిజంగా శ్రీలీలను కొట్టలేదు. సన్నివేశంలో భాగంగా చేయి చేసుకున్నారు. శ్రీలీల ఈ మూవీలో బాలయ్య మేనకోడలిగా నటిస్తున్నారని సమాచారం. తప్పు చేసిన మేనకోడలిని మందలించే సన్నివేశంలో బాలకృష్ణ శ్రీలీల చెంపపై కొట్టారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. కాగా శ్రీలీల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆమె తెలుగులో ప్రసంగించడం జరిగింది.

Balakrishna- Sreeleela: బాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా పూర్తి చేశారు. వెంటనే షూటింగ్ సెట్స్ కి వెళ్లారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలయ్య 108వ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్లు సమాచారం. ప్రధాన తారాగణం బాలయ్య, శ్రీలీల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. కాగా సెట్స్ లో బాలయ్య శ్రీలీల చెంప చెళ్లుమనిపించాడట. బాలయ్య ముక్కోపి. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. పబ్లిక్ లో అభిమానులను పరుగెత్తించి మరీ కొట్టిన చరిత్ర ఆయన సొంతం. ఈ క్రమంలో బాలయ్య శ్రీలీలను కొట్టాడన్న న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఇక్కడ బాలయ్య నిజంగా శ్రీలీలను కొట్టలేదు. సన్నివేశంలో భాగంగా చేయి చేసుకున్నారు. శ్రీలీల ఈ మూవీలో బాలయ్య మేనకోడలిగా నటిస్తున్నారని సమాచారం. తప్పు చేసిన మేనకోడలిని మందలించే సన్నివేశంలో బాలకృష్ణ శ్రీలీల చెంపపై కొట్టారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. కాగా శ్రీలీల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆమె తెలుగులో ప్రసంగించడం జరిగింది.
ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందని అనిల్ రావిపూడి ఇప్పటికే చెప్పారు. విడుదలైన బాలయ్య లుక్ ఆకట్టుకుంది. దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. అందుకే త్వరిత గతిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. చందమామ కాజల్ కెరీర్లో మొదటిసారి బాలయ్యకు జంటగా నటిస్తున్నారు. బాలయ్య-కాజల్ కాంబో వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలి.
ఇక వరుస విజయాలతో బాలకృష్ణ ఫార్మ్ లోకి వచ్చారు. ఒక దశలో ఆయన సినిమాలు ఘోర పరాజయాలు చూశాయి. నాలుగైదు కోట్ల షేర్ రాబట్టలేని పరిస్థితికి బాలయ్య మార్కెట్ పడిపోయింది. కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యను ఆదుకున్నాడు. మెమరబుల్ హిట్ ఇచ్చాడు. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ విజయం అందుకుంది. ఇక వీరసింహారెడ్డి చిత్రంతో సంక్రాంతి హిట్ కొట్టాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య డ్యూయల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు.