Balakrishna: బాలకృష్ణ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన నోటి దురుసు, అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు గొడవలకు కారణమవుతున్నాయి. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత కామెంట్స్ చేశారు. ఇది ఏఎన్నార్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఒక లెజెండరీ యాక్టర్ ని బాలయ్య అవమానించారంటూ ఆందోళనలు చేశారు. బాలయ్య దిష్టిబొమ్మలు తగలబెట్టడంతో పాటు అక్కినేని అభిమాన సంఘాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఎన్నార్ మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ సైతం ఈ వివాదంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అవమానించడం అంటే మనల్ని మనం అవమానించుకోవడం, అంటూ సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు.

Balakrishna
బాలయ్య తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఏఎన్నార్ అంటే నాకు ఎక్కడలేని అభిమానం. అసలు ఏఎన్నార్ తన కుటుంబ సభ్యుల కంటే కూడా నాతో ప్రేమగా ఉండేవారు. బహుశా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని నిరాదరణకు గురి చేసి ఉండొచ్చంటూ గొడవకు ఆజ్యం పోసే ప్రయత్నం చేశారు. తాజాగా అన్ స్టాపబుల్ వేదికగా నర్స్ లను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య నర్స్ లను కించపరిచేలా కామెంట్స్ చేశారు. గతంలో కూడా ఆయన ఒక సందర్భంలో నర్స్ లను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అలాగే బాలయ్య దేవాంగ కులాన్ని కించపరచడం హాట్ టాపిక్ అయ్యింది. దేవాంగ కుల గురువు రావణాసురుడని బాలయ్య చెప్పడం వారి మనోభావాలను దెబ్బతీసింది. సదరు కుల సంఘాల పెద్దలు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Balakrishna
వారి విషయంలో దిగొచ్చిన బాలయ్య క్షమాపణలు చెప్పారు. అవి అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు మాత్రమే, దేవాంగ కులాన్ని అవమానించాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని వివరణ ఇచ్చారు. పబ్లిక్ లో కూడా బాలయ్య చేష్టలు, మాటలు పరుషంగా ఉంటాయి. ఒక హోదాలో ఉన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఓ సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ ‘అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని చెప్పి, సంచలనానికి పాల్పడ్డారు.