Nandamuri Balakrishna: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలయ్య కమర్షియల్ యాడ్స్!

ఎన్టీఆర్ వారసుడైన జూనియర్ రావడం లేదని ఇప్పటికే తెలియజేశారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది. వేదికపైకి వచ్చే వరకు నమ్మలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు

  • Written By: SRK
  • Published On:
Nandamuri Balakrishna: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలయ్య కమర్షియల్ యాడ్స్!

Nandamuri Balakrishna: యుగపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ వేదికగా భారీ సభ ఏర్పాటు చేశారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఉత్సవాలకు అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ గడ్డపై అంతకు మించి అట్టహాసంగా నిర్వహించాలని టీడీపీ వర్గాలు పూనుకున్నాయి. రాజకీయ నాయకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది. వీరిలో కొందరు హాజరయ్యే సూచనలు కలవు.

ఎన్టీఆర్ వారసుడైన జూనియర్ రావడం లేదని ఇప్పటికే తెలియజేశారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది. వేదికపైకి వచ్చే వరకు నమ్మలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. లెజెండరీ నటుడు శతజయంతి ఉత్సవాల్లో బాలయ్య కమర్షియల్ యాడ్స్ ప్రదర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య బాలయ్య ఓ రియల్ ఎస్టేట్, మరో జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సంస్థల యాడ్స్ కార్యక్రమం ప్రారంభంలో ప్రదర్శించారు. ఒక ప్రతిష్టాత్మక వేడుకలో కమర్షియల్ యాడ్స్ ప్రదర్శన దారుణమని కొందరి అభిప్రాయం. ఒక వేళ ఆ సంస్థలు స్పాన్సర్స్ కావచ్చు. మొత్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వ్యాపార ప్రకటనలు ప్రదర్శించడం హాట్ టాపిక్ అవుతుంది. నేటి కార్యక్రమాన్ని బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నారు. మరి తండ్రి ఎన్టీఆర్ కి నివాళిగా ఆయన చిత్రంలోని ఓ పాటను వేదికపై బాలయ్య పాడే అవకాశం కలదు.

కాగా బాలకృష్ణ తన 108వ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొంచెం విరామం తీసుకొని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బాలయ్య 108 చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడిగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీ నుండి బాలయ్య లుక్ కేకపుట్టించింది. ఈ చిత్రంలో బాలయ్య డ్రైవర్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దసరా కానుకగా విడుదల కానుందని సమాచారం. బాలయ్య గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి భారీ విజయాలు సాధించాయి. చెప్పాలంటే బాలయ్య ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు