Nalgonda Alekhya: ఈ చదువుల తల్లికి ఎంత కష్టమొచ్చే…
నల్గొండ జిల్లాకు చెందిన అలేఖ్య కు చిన్నప్పటి నుంచే కష్టాలు వెన్నంటి ఉంటున్నాయి. నల్గొండ జిల్లా గుర్రపోడు మండలం కొత్తలాపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన వెంటయ్య, లక్ష్మమ్మ ఆమె తల్లిదండ్రులు.

Nalgonda Alekhya: జీవితమంటే పూల పాన్పు కాదు.. ఎన్నో కష్టాలను అధిగమించాలి… ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి.. అప్పుడు కలలు సాకారం అవుతాయి. కానీ కొందరు ఎంత కష్టపడినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కష్టాలు వెన్నంటే ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు పడే బాధలు చెప్పరానివి. పేదరికంలో పుట్టిన అమ్మాయిలు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. కానీ కుటుంబ పరిస్థితులు వారి కలలను మధ్యలోనే నాశనం చేస్తాయి. అయినా కొందరు కష్టాలను, బాధలను దిగమింగుకొని ముందుకు సాగుతారు. అయితే ఓ చదువుల తల్లికి మాత్రం పెద్ద కష్టమే వచ్చింది. తల్లికి అనారోగ్యం గురైతే తండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు.. కొన్ని రోజుల తరువాత తల్లి మరణించింది. అయినా పుట్టెడు దు:ఖంతో శ్రద్దగా చదివి టెన్త్ ఫలితాల్లో ఆమె 9.7 జీపీఏ తో పాస్ అయింది. కానీ పై చదువుల కోసం ఆమె ఏం చేస్తుందో తెలుసా?
నల్గొండ జిల్లాకు చెందిన అలేఖ్య కు చిన్నప్పటి నుంచే కష్టాలు వెన్నంటి ఉంటున్నాయి. నల్గొండ జిల్లా గుర్రపోడు మండలం కొత్తలాపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన వెంటయ్య, లక్ష్మమ్మ ఆమె తల్లిదండ్రులు. లక్ష్మమ్మకు అనారోగ్యం కావడంతో వెంకటయ్య ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కానీ అప్పటికే వారికి అలేఖ్య అనే కూతురు ఉంది. దీంతో ఎన్నో కష్టాల మధ్య తన కూతురిని చదివించాలని అనుకుంది. కానీ అలేఖ్య తల్లి కష్టం చూడలేక హాస్టల్ ఉంటూ పదోతరగతి వరకు చదివింది. అయితే తాను పదోతరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో తల్లి మరణించింది. దీంతో అలేఖ్య కుంగిపోయింది.
కానీ తాను ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని మాత్రం వదలలేదు. పట్టుదలతో చదివిన ఈమె 2023 పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 9.7 జీపీఏ ను తెచ్చుకుంది. దీంతో ఆమెను అందరూ అభినందించారు. కానీ ఆమె పై చదువుల ఏం చేయాలో అర్థం కాక అలేఖ్య తీవ్రంగా బాధపడింది. అయితే ఆమె చదివిన పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆమెకు ఆర్థిక సాయం చేశారు. కానీ జీవితం గడవడానికి ఏదో ఒక పనిచేయాలని అనుకొంది.
దీంతో ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె తన చదువు కోసం ఆర్థిక సాయం చేయాలని కోరుతోంది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించిన వారు సాధారణ స్థితిలో పాసవుతున్నారు. కానీ తల్లిదండ్రులు లేకుండా, ఎలాంటి సపోర్టు లేక ఆమె పదోతరగతిలో 9.7 జీపీఏ సాధించడంపై అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఆమె పై చదువుల కోసం సాయం చేస్తే ఉన్నత స్థితిలో ఉంటారని అంటున్నారు.
