Bigg Boss 7 Telugu: నువ్వేమైనా పిస్తావా ఆట సందీప్ కి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్, బ్యాటరీ డౌన్! కారణం ఇదే!
శోభా శెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ప్రిన్స్ యావర్ ని పక్కన పెట్టాలి అని చెప్పింది. కానీ బిగ్ బాస్ అడిగింది వీకెస్ట్ కంటెస్టెంట్ ని నామినేట్ చేయమని కదా అని నాగార్జున సందీప్ ని అడిగాడు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 3వ వీకెండ్ లోకి ఎంటర్ అయ్యింది. నాగార్జున ఫుల్ జోష్ లో వచ్చేశాడు. వస్తూ వస్తూనే కొందరు కంటెస్టెంట్స్ కి ఇచ్చి పడేశాడు. వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగోలేదని అన్నాడు.అమర్ దీప్, ప్రియాంకలను నిల్చోమన్న నాగార్జున… కంటెండర్ గా అమర్ ఎందుకు అనర్హుడని చెప్పావ్ అని ప్రియాంకను అడిగాడు. ఆమె చెప్పిన రీజన్ కి నాగార్జున సంతృప్తి పడలేదు. ఇది సరైన రీజనా? అని అమర్ దీప్ ని అడిగాడు.. కాదు అని అమర్ దీప్ అన్నాడు. మరి ఎందుకు గట్టిగా చెప్పలేదని నాగార్జున అడిగారు.
ఇదే పాయింట్ చెబితే పల్లవి ప్రశాంత్ మీద అరిచావు. ప్రియాంక విషయంలో ఎందుకు వాదించలేదని అసహనం వ్యక్తం చేశాడు నాగార్జున. అమర్ నువ్వు నీ కోసం గేమ్ ఆడు ప్రియాంక కోసం కాదని గట్టిగా చెప్పాడు. సంచాలక్ గా ఉన్న సందీప్ కి కూడా నాగార్జున గట్టిగా ఇచ్చేశాడు. ప్రియాంక-శోభా శెట్టి కంటెండర్ రేసు నుండి ప్రిన్స్ యావర్ ని తప్పించిన విధానం, చెప్పిన కారణాలు సరిగాలేవు. అక్కడ సంచాలక్ గా ఉన్న సందీప్ ఫెయిల్ అయ్యాడని నాగార్జున అభిప్రాయ పడ్డాడు.
శోభా శెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ప్రిన్స్ యావర్ ని పక్కన పెట్టాలి అని చెప్పింది. కానీ బిగ్ బాస్ అడిగింది వీకెస్ట్ కంటెస్టెంట్ ని నామినేట్ చేయమని కదా అని నాగార్జున సందీప్ ని అడిగాడు. నిన్ను అక్కడకు పిలిచింది సంచాలక్ గా సరైన నిర్ణయం తీసుకుంటావని, అంతే కానీ పెద్ద పిస్తావని కాదు… అంటూ ఓ రేంజ్ లో ఇచ్చి పడేశాడు. సంచాలక్ బాధ్యత సరిగా నెరవేర్చని కారణంగా అతని ఇమ్యూనిటీ బ్యాటరీలో ఛార్జ్ తగ్గించాడు.
పవర్ అస్త్రతో ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందిన ఆట సందీప్ తన బ్యాటరీలో గ్రీన్ కోల్పోయి ఆరంజ్ కి వచ్చాడు. ఇక మిగతా 10 మంది కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ని నాగార్జున ఎలా రివ్యూ చేస్తాడో చూడాలి. విడుదలైన ప్రోమో ఎపిసోడ్ పై ఆసక్తి రేపుతోంది. అలాగే ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అమర్ దీప్, ప్రియాంక, దామిని, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, రతికా రోజ్ నామినేషన్స్ లో ఉన్నారు.
