Heroine Annie: నాగార్జున నన్ను మోసం చేశాడు… హీరోయిన్ అన్నీ సంచలన కామెంట్స్
రాజన్న సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. అనేక అవార్డ్స్ అందుకున్న రాజన్న కమర్షియల్ గా ఆడలేదు. పీరియాడిక్ రెవల్యూషనరీ డ్రామాగా తెరకెక్కింది.

Heroine Annie: చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 సినిమాల వరకూ చేసింది అన్నీ. ఆమె మొదటి సినిమా ‘అనుకోకుండా ఒకరోజు’. జగపతిబాబు, ఛార్మి ప్రధాన పాత్రలు చేశారు. అనంతరం స్టాలిన్, మధుమాసం, విజయదశమి, అతిథి, రెడీ, స్వగతం, శౌర్యంతో పాటు పలు చిత్రాల్లో బాల నటిగా కనిపించి మెప్పించింది. రాజన్న మూవీతో ఆమెకు పాపులారిటీ దక్కింది. రాజన్న మూవీలో ఆమెది ప్రధాన పాత్ర. నాగార్జున ఎక్స్టెండెడ్ క్యామియో చేశారు. నాగార్జునకు జంటగా స్నేహా నటించింది.
రాజన్న సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. అనేక అవార్డ్స్ అందుకున్న రాజన్న కమర్షియల్ గా ఆడలేదు. పీరియాడిక్ రెవల్యూషనరీ డ్రామాగా తెరకెక్కింది. అన్నీకి ఈ చిత్రంతో నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు మరి కొన్ని అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె బయటపెట్టారు.
నాగార్జున నన్ను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణ చేసింది. నాగార్జున నన్ను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారు. ఒకప్పుడు దత్తత తీసుకుంటానన్న నాగార్జున నేను తర్వాత కలిస్తే గుర్తు పట్టలేదు. నేనెవరో చెప్పాక గుర్తు పట్టారు. అప్పుడు పలకరించారు, అని ఆమె తెలియజేసింది. నాగార్జునను ఉద్దేశించి అన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అన్నీ ఓ వెబ్ సిరీస్లో నటించిన నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంటున్నారు. అన్నీ డిగ్రీ కంప్లీట్ చేసిందట. పూర్తిగా సినిమాలకు పరిమితం అవుతాను అంటుంది. ఇక అన్నీ మొదటి సంపాదన వెయ్యి రూపాయలట. సినిమాల్లోకి రాకముందు ఓ యాడ్ లో నటించినందుకు వెయ్యి రూపాయలు ఇచ్చారని వాళ్ళ అమ్మ చెప్పిందని అన్నీ వెల్లడించింది. హీరోయిన్ కావడమే తన లక్ష్యమని అన్నీ అంటుంది.
