కరోనాపై నాగబాబు ట్వీట్ వైరల్..

మెగా బ్రదర్ నాగబాబు టీవీ షోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంటారు. రాజకీయ అంశాలతోపాటు తాజా పరిస్థితులపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించిన సంగతి తెల్సిందే. ఇండియాలోనూ తాజాగా కరోనా కేసులు నమోదైన సంగతి తెల్సిందే. కరోనాపై పలువురు సెలబ్రెటీలు తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ మధ్యే నాగబాబు ‘మనుషులు చస్తే ఈ భూమిపై ఉన్న సకల జీవరాశులు సంతోషంగా ఉంటాయి.. మనిషి కంటే కరోనా వైరస్‌ […]

  • Written By: Neelambaram
  • Published On:
కరోనాపై నాగబాబు ట్వీట్ వైరల్..

మెగా బ్రదర్ నాగబాబు టీవీ షోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంటారు. రాజకీయ అంశాలతోపాటు తాజా పరిస్థితులపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించిన సంగతి తెల్సిందే. ఇండియాలోనూ తాజాగా కరోనా కేసులు నమోదైన సంగతి తెల్సిందే. కరోనాపై పలువురు సెలబ్రెటీలు తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ మధ్యే నాగబాబు
‘మనుషులు చస్తే ఈ భూమిపై ఉన్న సకల జీవరాశులు సంతోషంగా ఉంటాయి.. మనిషి కంటే కరోనా వైరస్‌ మేలు’ అని ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది.

తాజాగా నాగబాబు కరోనా మరో ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం కరోనా ప్రభావం కంటే.. కరోనా భయంతోనే మనుషులు చస్తున్నారని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో మరో సారి నాగబాబు ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

కరోనాతో అపాయమేమీ ఉండదని డాక్టర్లే చెబుతున్నప్పటికీ ప్రజలు ఎక్కువగా భయపడుతున్నారు. అందుకే నాగబాబు ఇలా ట్వీట్‌ చేసి ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం నాగబాబు ‘జబర్దస్త్‌’ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జీ టీవీలో ప్రసారమయ్యే ‘అదిరింది’ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు