Krishna Vrinda Vihari Review: రివ్యూ: కృష్ణ వ్రింద విహారి
నాగ శౌర్య, షిర్లే సెటియా జంటగా వచ్చిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

naga shourya
కథ :
కృష్ణ చారి(నాగ శౌర్య) హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. అయితే, కృష్ణ చారి నార్త్ ఇండియన్ అమ్మాయి అయిన వ్రింద (షిర్లీ) అనే మేనేజర్‌తో ప్రేమలో పడతాడు. కానీ షిర్లీకి ఓ విచిత్రమైన డిసీజ్ ఉంటుంది. ఆ సమస్య గురించి కృష్ణ తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దీనికి తోడు వ్రింద ప్రవర్తన కృష్ణ తల్లికి నచ్చదు. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వ్రింద తన అత్తమామలతో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటీ ?, ఈ మధ్యలో కృష్ణా చారి ఎలాంటి ప్లాన్స్ వేశాడు?, చివరకు వీరి కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
నాగ శౌర్య, షిర్లీ ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. లవ్ సీన్స్ నుంచి ఎమోషనల్ సన్నివేశాల వరకూ ఇద్దరు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మెయిన్ గా క్లైమాక్స్ లో నాగ శౌర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. బ్రహ్మిణ్ కుర్రాడిగా నాగ శౌర్య నటన చాలా సహజంగా ఉంది. బాడీ లాంగ్వేజ్ మొదలుకుని ప్రతి విషయంలో శౌర్య చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

naga shourya
ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు అనీష్ అర్ కృష్ణ ఈ కథలోకి వాస్తవ జీవితాల్లోని కొన్ని సంఘటనలను, పరిస్థితులను తీసుకొచ్చి వాటిని బాగానే చూపించాడు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం బాగున్నా… సహజంగా పాత్రలు సాగవు. సినిమా చూస్తున్నంత సేపు గతంలో ఎక్కడో ఈ సీన్స్ చూశాం కదా అనే భావన కలుగుతుంది. అలాగే డైరెక్టర్ రాసుకున్న సున్నితమైన భావోద్వేగాలు కొన్ని చోట్ల బోర్ గా సాగుతాయి.
ప్లస్ పాయింట్స్ :
నాగ శౌర్య నటన,
కథ,
మిగిలిన నటీనటుల నటన,
ఎమోషనల్ గా సాగే లవ్ డ్రామా,
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్,
రెగ్యులర్ స్క్రీన్ ప్లే,
రొటీన్ సీన్స్,
అండ్ ఫేక్ ఎమోషన్స్
సినిమా చూడాలా ? వద్దా ?
నాగశౌర్య తన నటనతో ఈ సినిమా స్థాయిని పెంచాడు. ముఖ్యంగా హీరోయిన్ తో అతని కెమిస్ట్రీ చాలా బాగుంది. కాకపోతే.. బోరింగ్ ప్లే, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2.5/ 5