Naga Chaitanya: వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాగ చైతన్య కెరీర్ కి ఇటీవలే విడుదలైన ‘థాంక్యూ’ సినిమా స్పీడ్ బ్రేకర్ లాగ నిలిచింది..మనం చిత్రం దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమా కావడం తో ఈ మూవీ పై మొదటి నుండి భారీ అంచనాలే ఉండేవి..కానీ ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది..ఇప్పుడు అక్కినేని ఫాన్స్ మొత్తం అమిర్ ఖాన్ హీరో గా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమా కోసమే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాలో నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో నటించాడు..బాలరాజు అనే ఆర్మీ ఆఫీసర్ గా నాగ చైతన్య సినిమాలో కనిపించబోతున్నాడు..ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా స్క్రిప్ట్ కోసం అమిర్ ఖాన్ ఎంతో కాలం నుండి పని చేస్తున్నాడు..ఇక అక్కినేని ఫాన్స్ అయితే తమ హీరో బాలీవుడ్ కి తొలి సినిమాతోనే అమిర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ సినిమా తో లాంచ్ అవుతుండడం తో వారి ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి..ఈ చిత్రం ఈ నెల 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.

Naga Chaitanya
ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు..ప్రొమోషన్స్ లో కూడా ఆయన అమిర్ ఖాన్ తో కలిసి చురుగ్గా పాల్గొంటున్నాడు..త్వరలోనే అమిర్ ఖాన్ , నాగ చైతన్య మరియు చిరంజీవి కాంబో, అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఒక ఇంటర్వ్యూ స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది..దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఫాన్స్ ఈ ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇది ఇలా ఉంచితే నాగ చైతన్య కి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Sai Pallavi: సినిమాలకు దూరం కానున్న సాయి పల్లవి?? ఫాన్స్ కి ఊహించని షాక్

Naga Chaitanya
బాలీవుడ్ టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరైన సంజయ్ లీల భంశాలి తో నాగ చైతన్య ఒక సినిమా చెయ్యబోతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇటీవలే నాగ చైతన్య ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి సంజయ్ లీల భంశాలి ఆఫీస్ కి వెళ్లారు..అక్కడ భంశాలి తో వీళ్లిద్దరు గంటకి పైగానే చర్చలు జరిపారు..వీళ్ళ కాంబినేషన్ లో కొత్త సినిమా కోసమే ఆ చర్చలు జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకి రానున్నాయి..అమీర్ ఖాన్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడం నాగ చైతన్య అదృష్టం అనే చెప్పాలి..ఎందుకంటే బాలీవుడ్ లో అమిర్ ఖాన్ సినిమా హిట్ అయితే 600 కోట్ల రూపాయిల కలెక్షన్స్ వస్తాయి..కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా చైనా జపాన్ వంటి దేశాల్లో కూడా ఆయన సినిమాలు అద్భుతంగా ఆడుతాయి..లాల్ సింగ్ చద్దా హిట్ అయితే నాగ చైతన్య కి బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయి అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..మరి చూడాలి ఆయన అదృష్టం ఎలా ఉందొ.
Also Read:Anasuya Bharadwaj: ‘సరసాలు చాలు’ అంటూ అనసూయ విరహ గానం.. తట్టుకోవడం కష్టమే?