Naga Chaitanya- Samantha: సమంత ని చూసి బయటకు వెళ్లి పోయిన నాగ చైతన్య.. నిజమెంత

అసలు విషయానికి వస్తే సుప్రియ నిర్మాణంలో రీసెంట్ గా విడుదలైన సినిమా బాయ్స్ హాస్టల్. కాదా ఈ సినిమా ప్రీమియర్ షోలో పాలుపంచుకున్నారు నాగచైతన్య.

  • Written By: Vishnupriya
  • Published On:
Naga Chaitanya- Samantha: సమంత ని చూసి బయటకు వెళ్లి పోయిన నాగ చైతన్య.. నిజమెంత

Naga Chaitanya- Samantha: ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరో నాగచైతన్య. ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు ఈ మధ్య పర్సనల్ లైఫ్ లో కూడా సమస్యలు ఎదుర్కొన్నారు ఈ హీరో. హీరోయిన్ సమంత తో ఈయన విడాకులు అప్పట్లో ఒక సంచలన వార్తగా మిగిలింది. అంతేకాదు ఈ డైవర్స్ వెనక సుమంత్ అక్క సుప్రియ యార్లగడ్డ జోక్యం కూడా ఉంది అని.. పలుమార్లు పలు కథనాలు వచ్చాయి.

ఇక ఇప్పుడు నాగచైతన్య.. సుప్రియ యార్లగడ్డ బయటకి వెళ్ళగా.. అక్కడ సమంత విషయంలో ఒక ఘటన చోటు చేసుకుందట. అదేమిటో ఒకసారి చూద్దాం.
నిన్న సెప్టెంబర్ ఒకటవ తేదీన సమంత సినిమా ఖుషి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి అలానే నాగచైతన్య కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయానికి వస్తే సుప్రియ నిర్మాణంలో రీసెంట్ గా విడుదలైన సినిమా బాయ్స్ హాస్టల్. కాదా ఈ సినిమా ప్రీమియర్ షోలో పాలుపంచుకున్నారు నాగచైతన్య. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ షో మధ్యలో ఖుషి సినిమా ట్రైలర్ వచ్చిందట. ఇక ఆ ట్రైలర్ రాగానే కోపంతో బయటకు వచ్చేసారట నాగచైతన్య. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కానీ మరో విషయం ఏమిటి అంటే రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఈ న్యూస్ పై స్పందించడం జరిగింది. కావాలని ఇలాంటి రూమర్స్ సృష్టించారే తప్ప తాను థియేటర్ నుంచి బయటకు వచ్చాను అనేది ఫేక్ న్యూస్ అని నాగచైతన్య స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఇలా తప్పుడు వార్తలు ప్రచురించిన ఆ సదరు మీడియా ఆ వార్తలను సరి చేసుకోవాలి అని కూడా సూచించారు.

ఇక వీళ్ళ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. కాగా వాళ్ళ డైవర్స్ గురించి కారణం మాత్రం ఇప్పటివరకు తెలియదు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఎవరి కెరియర్ లో వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు. అయినా మీడియాలో మాత్రం వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త రాకుండా ఉండడం లేదు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు