అక్కినేని నాగచైతన్య నటించిన ఏమాయ చేసావె, 100% లవ్, ప్రేమమ్, మజిలీ.. ఇలా పలు ప్రేమకథా చిత్రాలు విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఏకంగా ‘లవ్ స్టోర’` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడీ యంగ్ హీరో.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి నాయికగా నటిస్తోంది. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కొత్త షెడ్యూల్ ఈ నెల 21 నుంచి దుబాయ్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. పవన్ సంగీతమందిస్తున్న `లవ్ స్టోరి` వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.