Custody Collections: నాల్గవ రోజు ట్రేడ్ ని ఆశ్చర్యపరిచిన ‘కస్టడీ’ వసూళ్లు.. బయ్యర్స్ కి ఊరట!
నాల్గవ రోజు వసూళ్లు మూడవ రోజు స్థాయిలో 70 లక్షల రూపాయిల వరకు షేర్ వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఇదే స్థాయి ట్రెండ్ ని కొనసాగిస్తే 10 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అవలీల గా దాటేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు బయ్యర్స్.

Custody Collections: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘కస్టడీ’ చిత్రం ఇటీవలే గ్రాండ్ గా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ అనగా కొంత మంది బాగుంది అని చెప్తే, మరికొంత మంది యావరేజి అని చెప్పారు. ఈ స్థాయి టాక్ ఉన్న సినిమాలు ఓపెనింగ్స్ లేకపోయినా ఫుల్ రన్ లో పర్వాలేదు అనే విధంగా ఆడుతుంది.
కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రాలేదు,పోనీ రెండవ రోజు నుండైనా డీసెంట్ వసూళ్లు వస్తాయని ఆశిస్తే, రెండవ రోజు మూడవ రోజు కనీస స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. అలా మూడు రోజులకు కలిపి 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, నాల్గవ రోజు నుండి అన్నీ ప్రాంతాలలో దారుణంగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంటుంది అని ఊహించారు.
కానీ నాల్గవ రోజు వసూళ్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిందనే చెప్పాలి. మూడవ రోజు ఎంత వసూళ్లను అయితే రాబట్టిందో, నాల్గవ రోజు కూడా ఇంచుమించు అంతే వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. దీనిని బట్టి ఈ చిత్రానికి స్టడీ రన్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా మేజర్ సిటీస్ లో ఊహించిన స్థాయి డ్రాప్స్ లేవు,మార్నింగ్ షోస్ నుండే డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. దీనిని చూసి బయ్యర్స్ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినంత పని అయ్యింది.
నాల్గవ రోజు వసూళ్లు మూడవ రోజు స్థాయిలో 70 లక్షల రూపాయిల వరకు షేర్ వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఇదే స్థాయి ట్రెండ్ ని కొనసాగిస్తే 10 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అవలీల గా దాటేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు బయ్యర్స్. కానీ బ్రేక్ ఈవెన్ మార్కు అందుకోవాలంటే 22 కోట్లు వసూలు చెయ్యాలి, అది అసాధ్యం కానీ కనీసం యావరేజి రేంజ్ కి అయినా చేరుకుంటుంది అని అనుకుంటున్నారు, చూడాలి మరి.
