Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య పేరు తరుచూ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లోనే ఉంటుంది.అందుకు కారణం ఆయన సమంత తో విడాకులు తీసుకోవడమే.అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో వచ్చినన్ని ప్రత్యేక కథలు ఇండియాలో ఏ నటుడు మీద కూడా వచ్చి ఉండదు.ఆ స్థాయిలో వీళ్లిద్దరు సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యారు.
అయితే విడిపోయిన తర్వాత సమంత కి కెరీర్ పరంగా ‘యశోద’ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.కానీ నాగ చైతన్య కి మాత్రం ‘థాంక్యూ’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ వచ్చింది.ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘కస్టడీ’ అనే చిత్రం పైనే, తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా మే 12 వ తారీఖున విడుదల కానుంది.రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
కాసేపు ఇదంతా పక్కన పెడితే సమంత గతం లో సీనియర్ నటుడు మురళిమోహన్ అపార్ట్మెంట్స్ లో ఒక ప్లాట్ ని కొనుగోలు చేసి అందులోనే కాపురం చేసేవాళ్ళు.అయితే విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఆ ఫ్లాట్ నుండి బయటకి వచేసాడు కానీ, సమంత మాత్రం రాలేదు.ప్రస్తుతం ఆమె తన అమ్మతో కలిసి అదే ఫ్లాట్ లో ఉంటుంది.అయితే నాగ చైతన్య ఆ ఫ్లాట్ నుండి బయటకి వచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకం గా ఎలాంటి ఇంటిని కొనుగోలు చెయ్యలేదు.అయితే గత కొద్దీ రోజుల క్రితమే అక్కినేని నాగార్జున ఇంటికి కాస్త దూరంగా నాగ చైతన్య ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసి అక్కడ ఒక ఇంటిని నిర్మిస్తున్నాడు.తాను రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత, తన భార్య తో కలిసి ఆ ఇంట్లోకే అడుగుపెట్టబోతున్నాడట.
ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య గత కొద్ది రోజుల నుండి డేటింగ్ లో ఉంటున్నాడు అనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.ఇల్లు కూడా ఆమె పేరు మీదనే రాసాడట.అలా పెళ్ళికి ముందే తన ప్రేయసి కి విలువైన బహుమతిని ఏర్పాటు చేసిన నాగ చైతన్య కి సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.