NTR and Mahesh: క్రేజీ బ్యూటీగా కొన్నాళ్ళు పాటు స్టార్ డమ్ అనుభవించిన ‘నభా నటేష్’కి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా.. ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ ను ఈ బ్యూటీ క్యాష్ చేసుకోలేపోయింది. దాంతో ఒక్కసారిగా రేంజ్ కూడా మారిపోయింది. మీడియం రేంజ్ హీరోల నుంచి చిన్నాచితకా హీరోల సరసన నటించే స్థాయికి పడిపోయింది.
దానికి తోడు నభా స్థాయి కూడా రోజురోజుకు పడుతూ వచ్చింది. చివరకు ఛాన్స్ లు కూడా లేక ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయింది. అయితే, అదృష్టం ఉంటే.. పూర్తిగా ఓడిపోయాక కూడా విజయాలు అందుకోవచ్చు. ఇప్పుడు ‘నభా నటేష్’కి ఇది వర్తించేలా ఉంది. ఆమెకు క్రేజీ ఆఫర్ తగిలింది. కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో వస్తోన్న సినిమాలో ఒక కీలక పాత్ర ఉంది.
కాగా ఆ పాత్ర కోసం చిత్రబృందం నభాను ఫైనల్ చేసిందట. ఆ మధ్య మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా నభా నటేష్ ను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ఒకవేళ ఆమె పాత్ర ఉంటే.. అది కచ్చితంగా సెకెండ్ హీరోయిన్ పాత్రే అయి ఉంటుంది. అయినా ఎన్టీఆర్, మహేష్ సరసన నభాకి ఓ మంచి సాంగ్ పడితే.. ఇక నభా రేంజ్ మారిపోయినట్టే.
పైగా నభా ఖాతాలో మంచి హిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి… ఆమెకు మళ్ళీ హిట్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. నిజానికి నభా ఇప్పటివరకూ ఎక్కువుగా ఏవరేజ్ హీరోల సరసనే నటించింది. అందుకే నభాకి అనుకున్నంత స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. కాకపోతే ఈ సారి ఎన్టీఆర్, మహేష్ సినిమాల్లో నటిస్తోంది కాబట్టి, ఆమె కెరీర్ కి మినిమమ్ గ్యారంటీ ఉన్నట్టే.