హాట్ బ్యూటీ కెరీర్ తిరిగినట్టే, ఇక తిరుగు లేనట్లే !

కన్నడ భామ ‘నభా నటేష్’కి గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. నిజానికి ప్రస్తుతం ఉన్న చాలామంది గ్లామర్ డాల్స్ కంటే కూడా, నభా అందంలోనూ అభినయంలోనూ చాల మంచి ఆర్టిస్ట్. కానీ, ఎందుకో నభాకి ఇన్నాళ్లు చెప్పుకోతగ్గ పెద్ద సినిమా ఆఫర్లు రాలేదు. ఆ మధ్య వచ్చిన ఆఫర్లు కూడా కిక్ ఇవ్వలేదు. అందుకే, ఓ ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా స్టార్ హీరోలూ నాకు ఛాన్స్ లు ఇవ్వండి అని వేడుకుంది. మొత్తానికి ఆమె బాధను అర్థం […]

  • Written By: Raghava
  • Published On:
హాట్ బ్యూటీ  కెరీర్ తిరిగినట్టే,   ఇక తిరుగు లేనట్లే !

Nabha With Bollywood Star Hero

కన్నడ భామ ‘నభా నటేష్’కి గత కొంతకాలంగా అవకాశాలు తగ్గాయి. నిజానికి ప్రస్తుతం ఉన్న చాలామంది గ్లామర్ డాల్స్ కంటే కూడా, నభా అందంలోనూ అభినయంలోనూ చాల మంచి ఆర్టిస్ట్. కానీ, ఎందుకో నభాకి ఇన్నాళ్లు చెప్పుకోతగ్గ పెద్ద సినిమా ఆఫర్లు రాలేదు. ఆ మధ్య వచ్చిన ఆఫర్లు కూడా కిక్ ఇవ్వలేదు. అందుకే, ఓ ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా స్టార్ హీరోలూ నాకు ఛాన్స్ లు ఇవ్వండి అని వేడుకుంది.

మొత్తానికి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో. అవును, నభా కి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సరసన నటించే ఛాన్స్ ను కొట్టేసింది. పైగా హాలీవుడ్‌ ఫేమస్ సిరీస్ రీమేక్ లో నభా నటిస్తోంది. హాలీవుడ్ లో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన స్పై థ్రిల్లర్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’. ఒక విధంగా ఈ సిరీస్ హాలీవుడ్ సిరీస్ ల్లోనే సూపర్ డూపర్ హిట్.

అందుకే ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ఈ వెబ్‌ సిరీస్‌ ను ఇండియాలో కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోన్న నేపథ్యంలో.. ఈ సిరీస్ కి హీరోగా హృతిక్‌ రోషన్‌ ను ఫైనల్ చేశారు. అయితే, హృతిక్‌ రోషన్‌ సరసన హీరోయిన్ అంటే.. ఏ స్టార్ హీరోయిన్నో తీసుకుంటారు. కానీ మేకర్స్ కొత్తగా ఆలోచించారు. నభా నటేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారట.

ఒకవేళ ఈ వార్త గాని నిజమైతే.. ఇక నభా నటేష్ కెరీర్ తిరిగినట్టే. ఇప్పట్లో ఈ బ్యూటీకి ఇక తిరుగు లేనట్లే. నిజానికి ఈ హాట్ బ్యూటీ పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు. గత కొన్ని సినిమాలుగా వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న థాంక్యూ సినిమాలో మొదట నభా నటేష్ ని తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమెను తప్పించారు. అయితే, నభాకి అదృష్టం కలిసి వచ్చి బంపర్ ఆఫర్ కొట్టేసింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు