కోలుకొంటున్న వూహాన్‌ నగరం… దోషిగా చైనా!

కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్‌ నగరం కోలుకున్నది. రెండు నెలల లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దాదాపు 63 రోజులపాటు లాక్‌డౌన్‌కు గురైన ప్రజానీకం ఒక్కసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు కోటి పది లక్షల జనాభా ఉన్న వూహాన్‌.. జనవరి మొదటివారం నుంచి వార్తల్లోకెక్కింది. తొలి కరోనా వైరస్‌ నమోదుతో వూహాన్‌ నగరంపై చైనా ప్రభుత్వం దృష్టిసారించింది. లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేసింది. రోడ్లను బ్లాక్‌ చేశారు. […]

  • Written By: Neelambaram
  • Published On:
కోలుకొంటున్న వూహాన్‌ నగరం… దోషిగా చైనా!

కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్‌ నగరం కోలుకున్నది. రెండు నెలల లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దాదాపు 63 రోజులపాటు లాక్‌డౌన్‌కు గురైన ప్రజానీకం ఒక్కసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నంత భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు కోటి పది లక్షల జనాభా ఉన్న వూహాన్‌.. జనవరి మొదటివారం నుంచి వార్తల్లోకెక్కింది.

తొలి కరోనా వైరస్‌ నమోదుతో వూహాన్‌ నగరంపై చైనా ప్రభుత్వం దృష్టిసారించింది. లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేసింది. రోడ్లను బ్లాక్‌ చేశారు. నగరంలోకి ఇతర ప్రాంతాలవారు రాకుండా సరిహద్దులను మూసేశారు. చైనాతోపాటు మిగతా ప్రపంచదేశాలతో వూహాన్‌కు సంబంధాలు లేకుండా చేశారు.

ఎక్కడికక్కడ క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి వైద్యారోగ్య సిబ్బంది 24 గంటలపాటు సేవలందించారు. మొత్తానికి కరోనా వైరస్‌ను కట్టడిచేశారు. ఈ నేపథ్యంలో శనివారం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

ఇలా ఉండగా, కరోనా వైరస్ కారణంగా ప్రపంచ జనాల ముందు చైనా తలదించుకోవాల్సి వస్తున్నది. ఈ వ్యాధి చైనా నుంచే వ్యాపించటంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమ దేశాల ప్రజలు చైనా అంటే చీదరించుకుంటున్నారని పలు కధనాలు వెలువడుతున్నాయి.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్లో అయితే చైనాను అసహ్యించుకుంటూ పోస్టులు పెడుతున్నవారి సంఖ్య ఏకంగా 900 శాతం పెరిగిందని ట్విటర్‌లో ట్రెండ్ అయిన హాష్‌ట్యాగ్‌ల ఆధారంగా లైట్ అనే సోషల్ మీడియా విశ్లేషణ సంస్థ తేల్చింది.

ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ బయటపడిన తర్వాత చైనాతోపాటు ఆసియా పౌరులపై పశ్చిమ దేశాల్లో జాతి వివక్ష వ్యాఖ్యలు పెరిగిపోయాయి. వేలాది వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా గ్రూపులు, వీడియోలు, చిత్రాలు, ఆడియోలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు లైట్ సంస్థ వెల్లడించింది.

ప్రజల్లో ఈ పెడదోరణిపై అమెరికాలాంటి దేశాల్లో హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో కోవిడ్-19 బయటపడిన తర్వాత ఆ దేశ ప్రజల ఆహారపు అలవాట్లపై అభ్యంతరకరమైన పోస్టులు పెరిగిపోయాయి.

సంబంధిత వార్తలు