India Exit Polls : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అన్నది తేటతెల్లం చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడడం.. అక్కడ ఆప్ మంత్రి జైల్లో రాజభోగాలు సహా అవినీతి బయటపడ్డా జనాలు ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేశారు. ఏంటి కారణం అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. ప్రజలకు అవినీతి ప్రధాన సమస్యగా కనిపించడం లేదు. వారి తక్షణ సమస్యలే ప్రధాన సమస్యగా కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన సంక్షేమ, పథకాలే ఆ పార్టీకి పట్టం కట్టాయి. ఈసారి ఢిల్లీలో ఆప్ పార్టీకి ఎక్కువగా ఓట్లు వేసింది అన్ ఎడ్యూకేటెడ్ పీపుల్ కావడం విశేషం. విద్యావంతులు బీజేపీకి ఓటేయడం విశేషం.
విద్యావంతుల పార్టీగా ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వారినే దూరం చేసుకోవడం గమనార్హం. దాదాపు 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ ను ఏలిన బీజేపీపై వ్యతిరేకత వల్ల ఈసారి ఆమ్ ఆద్మీ గెలుస్తోంది.
ఇక హిమాచల్ , గుజరాత్ లలోనూ బీజేపీ హవా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.