Pakistan Sangeeta: పాకిస్థాన్‌లో హిందూ సంపన్నురాలు.. ఆమె సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

సంగీత కేవలం పాకిస్థాన్‌లోని హిందూ మహిళగా మాత్రమే కాకుండా.. భారతదేశంలో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఈమె దివంగత భారతీయ నటి ‘జియా ఖాన్‌’కు అత్త.

  • Written By: DRS
  • Published On:
Pakistan Sangeeta: పాకిస్థాన్‌లో హిందూ సంపన్నురాలు.. ఆమె సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

Pakistan Sangeeta: పాకిస్థాన్‌ మన దాయాది దేశం. స్వాతంత్య్రానికి ముందు అఖండ భారత దేశంగా ఉన్న ఇండియా పాకిస్థాన్‌.. స్వాతంత్య్ర సమయంలో రెండుగా విడిపోయాయి. పాకిస్థాన్‌లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంటుందని అందరికి తెలుసు. అయితే అక్కడ అతి తక్కువ సంఖ్యలో హిందువులు కూడా నివసిస్తున్నారు. 1947లో విభజన జరిగినప్పటి నుంచి కొందరు అక్కడే ఉండిపోయారు. అలాంటి వారిలో ‘సంగీత’ ఒకరు. ఈమె ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న అత్యంత ధనిక హిందూ మహిళ. ఇంతకీ సంగీత ఎవరు? ఆమె సంపాదన ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

దేశం ఆర్థిక సంక్షోభంలో.. ఆమె మాత్రం..
పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన వేళ అత్యంత సంపన్నుల జాబితాలో హిందువులు కూడా ఉండటం గమనార్హం. ఇందులో అత్యంత ధనిక హిందువు ‘దీపక్‌ పెర్వానీ’ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ కాగా, ధనిక హిందూ మహిళగా ‘సంగీత’ రికార్డ్‌ సృష్టించింది. వీరిద్దరూ కూడా సినీ రంగానికి చెందినవారు కావడం మరో గొప్ప విషయం.

సంగీత పాకిస్థాన్‌లో ప్రముఖ నటి. ఈమెను ‘పర్వీన్‌ రిజ్వీ’ అని కూడా పిలుస్తారు. అయితే తన పేరు అక్కడ మతానికి వ్యతిరేకంగా ఉండటం వల్లే పర్వీన్‌ రిజ్వీగా పేరు మార్చుకుంది. విభజనకు ముందు ఇండియాలో జన్మించిన సంగీత హిందూ మహిళగానే పాకిస్థాన్‌లో జీవనం సాగిస్తోంది. ఇప్పుడు పాకిస్థాన్‌లో అత్యంత ధనిక మహిళగా రికార్డ్‌ సృష్టించింది.

నటనతోపాటు దర్శకత్వం..
పర్వీన్‌ రిజ్వీ కేవలం నటి మాత్రమే కాదు, చిత్ర దర్శకురాలు కూడా. ఈమె కోహ్‌–ఎ–నూర్‌ అనే సినిమాతో సినీ రంగంలో అరంగేట్రం చేసినప్పటికీ.. తన 21 ఏట నుంచి ఈ రంగంలో మరింత దృఢంగా నిలదొక్కుకోగలిగింది. నికాహ్, ముత్తి భర్‌ చావల్, యే అమన్, నామ్‌ మేరా బద్నామ్‌ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే ఒక పాపులర్‌ నటిగా గుర్తింపు పొందగలిగింది.

భారత్‌తో బలమైన సంబంధాలు..
సంగీత కేవలం పాకిస్థాన్‌లోని హిందూ మహిళగా మాత్రమే కాకుండా.. భారతదేశంలో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఈమె దివంగత భారతీయ నటి ‘జియా ఖాన్‌’కు అత్త.

ఏడాదికి రూ.39 కోట్లు..
సంగీత సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది అనే విషయం కచ్చితంగా అందుబాటులో లేదు, కానీ ఈమె ఏడాదికి సుమారు రూ. 39 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె సంపాదన అంతకంటే ఎక్కువగానే ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. హిందువు అంటేనే నచ్చని పాకిస్థాన్‌ దేశంలో హిందువుగా ఉంటూ.. సంపన్నురాలిగా, అదీ పాకిస్థాన్‌ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన వేళ రికార్డు సృష్టించడం మరో విశేషం.

Read Today's Latest International politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు