Belly Dance Train: రైల్లో బెల్లీ డ్యాన్‌ చేసిన యువతి.. ఆ ఊపుడుకు నెటిజన్స్‌ ఫిదా.. వైరల్‌ అవుతున్న వీడియో

ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ఓ యువతి బెల్లీ డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తుంది. శాండ్‌ హార్ట్స్‌ రోడ్, మసీద్‌ స్టేషన్ల మధ్య నడుస్తున్న రైలులో ఆమె డ్యాన్స్‌ చేసింది.

  • Written By: Raj Shekar
  • Published On:
Belly Dance Train: రైల్లో బెల్లీ డ్యాన్‌ చేసిన యువతి.. ఆ ఊపుడుకు నెటిజన్స్‌ ఫిదా.. వైరల్‌ అవుతున్న వీడియో

Belly Dance Train: వెర్రి వెయ్యి విధాలు అంటారు. పుర్రెకో బుద్ధి అన్న నానుడి కూడా ఉంది. ఈ సామెతలు కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది. నేటితరం యువత పోకడ చూస్తే ఎవరూ కాదనరు. సోషల్‌ మీడియాలో ట్రెడింగ్‌ కావడానికి, లైక్స్, వ్యూస్‌ కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రోడ్లపై బైకులతో స్కిట్స్‌ చేస్తున్నారు. బైక్‌ పై అమ్మాయిని కూర్బొబెట్టుకుని ముద్దులతో రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్లలోనే కాదూ మెట్రో సర్వీసుల్లో కూడా వెకిలి చేష్టలకు పాల్పడుతూ కంట పడిన ఘటనలు ఉన్నాయి. అమ్మాయిలు కూడా తామేమీ తీసిపోవడం లేదని నిరూపిస్తున్నారు. ఫేమ్‌ కోసం రైల్వే స్టేషన్లలో డ్యాన్సులు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి చర్యల వల్ల కొన్ని సార్లు వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మెట్రోలో డ్యాన్స్‌లను బ్యాన్‌ చేసినా.. తాము మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తాజాగా అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ముంబయి ట్రైన్‌లో బెల్లీ డ్యాన్స్‌..
ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ఓ యువతి బెల్లీ డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తుంది. శాండ్‌ హార్ట్స్‌ రోడ్, మసీద్‌ స్టేషన్ల మధ్య నడుస్తున్న రైలులో ఆమె డ్యాన్స్‌ చేసింది. ఆ వీడియోకు భారీ స్పందన లభించింది. అదే సమయంలో కొంత మంది ఆమె చర్యలను తప్పుబుడుతూ.. ఆ యువతి అసభ్యకర రీతిలో డ్యాన్స్‌ చేసిందంటూ ముంబయి పోలీసులకు సోషల్‌ మీడియా వేదికగా ట్యాగ్‌ చేశారు. దీంతో ఇది కాస్తా ముంబయి పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ఆ వీడియోను ముంబయి రైల్వే పోలీస్‌ కమిషనరేట్‌ ఖాతాకు ట్విట్టర్‌ (అలియాస్‌ ఎక్స్‌)కు ట్యాగ్‌ చేశారు. రైల్వే పోలీసులు ఆ యువతి ఎవరు అని విచారణ చేస్తున్నారు.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు