Dunzo: ముఖేష్, ఇషా అంబానీ కంపెనీ దివాళా.. కనీసం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి..

ప్రస్తుతం డన్జో కంపెనీ ఆర్థిక లోటులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎంతలా అంటే ఇందులో పనిచేసేవారికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది.

  • Written By: Chai Muchhata
  • Published On:
Dunzo: ముఖేష్, ఇషా అంబానీ కంపెనీ దివాళా.. కనీసం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి..

Dunzo: భారత అపరకుభేరుడు ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రోజురోజుకు విస్తరించుకుంటూ పోతున్నాడు. తన వ్యాపారాల్లో కొంత భాగాన్ని కుమారులు, కూతురు ఇషా అంబానీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్స్ సంస్థలను చూసుకుంటున్నారు. ఇటీవలే ఇవి ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీల కంటే ఎక్కువగా విలువైనవని కొన్ని సంస్థలు ప్రకటించాయి. అయితే తండ్రీ కూతుళ్లు కలిసి తమ వ్యాపారాలనే కాకుండా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. గత ఏడాది జనవరిలో బెంగుళూరుకు చెందిన ‘డన్జో’ (Dunzo) అనే కంపెనీలో షేర్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా?

చాలా మంది వినియోగదారులు బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. దీంతో నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేసేంత సమయం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లోనే వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. వినియోగదారుల అవసరాలను తెలుసుకున్న కొంత మంది కిరాణ సరుకులను ఇంటికి డెలివరీ చేసే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇలా చేసినందుకు ఎంతో కొంత చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే బెంగుళూరులో వీటిని పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్నాయి. కిరాణ సరుకులను డెలివరీ చేసే వ్యాపారంలో బెంగుళూరులో బ్లింకిట్, జెప్టోలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటికి ‘డన్జో’ పోటీ పడుతోంది. అయితే గత ఏడాది జనవరిలో ఈ కంపెనీలో ముఖేష్ అంబానీ దాదాపు 25 శాతం వాటాను రూ.1,641 కోట్లకు దక్కించుకున్నారు.

అయితే ప్రస్తుతం డన్జో కంపెనీ ఆర్థిక లోటులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎంతలా అంటే ఇందులో పనిచేసేవారికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో డన్జో యాజమాన్యం కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన రిలయన్స్ రిటైల్ తో చర్చలు జరిపింది. దీనిని ఇషా అంబానీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డన్జో క్రైషెస్ నుంచి బయటపడడానికి రూ.164 కోట్లుు కావాలని గత నెలలో చర్చలు జరిపింది. తాజాగా మరో రూ.830 కోట్లు కావాలని చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

2014లో కబీర్ బిస్వాస్, అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి, ముకుంద్ ఝూ లు కలిసి ‘డన్జో’ను స్థాపించారు. దీని నిర్వహణకు వీరు వివిధ మార్గాల ద్వారా నిధులను సేకరించింది. అయితే తాజాగా గూగుల్ ఇండియా, నీలెక్సో, క్లోవర్ వెంచర్స్, ఫేస్బుక్ వంటి దిగ్గజాల నుంచి లీగల్ నోటీసులను అందుకుంది. కంపెనీ అప్పుల్లో కూరుకుపోవడంతో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. మిగిలిన వారికి జీతాలను ఇవ్వడంలో ఆలస్యం చేస్తోంది. గత జూన్ నుంచి వీరికి జీతాలు చెల్లించలేదని తెలుస్తోంది. అయితే కాంపోనెంట్ పై సంవత్సరానికి 12 శాతం వడ్డీని చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. సెప్టెంబర్ నాటికి కంపెనీ కదుటపడుతుందని అంటున్నారు.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు