Salman Khan – Puri Jagannath: పూరి జగన్నాథ్ దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ సినిమాకి ముహూర్తం ఫిక్స్
Salman Khan – Puri Jagannath: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హీరోయిజమ్ లో సరికొత్త కోణం ని ఆవిష్కరించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బద్రి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఇతను తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు..అప్పట్లో ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఎదో కొత్త రకం హీరోయిజమ్ ని చూసిన అనుభూతి కలిగింది..ఇక ఆ తర్వాత ఎన్నో సెన్సషనల్ బ్లాక్ […]

Salman Khan – Puri Jagannath: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హీరోయిజమ్ లో సరికొత్త కోణం ని ఆవిష్కరించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన బద్రి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఇతను తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు..అప్పట్లో ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఎదో కొత్త రకం హీరోయిజమ్ ని చూసిన అనుభూతి కలిగింది..ఇక ఆ తర్వాత ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పూరి జగన్నాథ్ పోకిరి సినిమాతో వేరే లెవెల్ కి వెళ్లిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి మాటల్లో చెప్పలేము.

Salman Khan – Puri Jagannath
Also Read: Allu Arjun Pushpa 2: పుష్ప 2 పూజ కార్యక్రమం కి అల్లు అర్జున్ డుమ్మా కొట్టడానికి కారణం అదేనా?
ఒక్క తెలుగులో మాత్రమే కాదు..ఈ సినిమాని ఇతర బాషలలో రీమేక్ చేసారు..ప్రతి చోట బంపర్ హిట్టే..ముఖ్యంగా బాలీవుడ్ లో వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న సల్మాన్ ఖాన్ ని హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇదే..ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..హిట్టు మీద హిట్టు కొడుతూ బాలీవుడ్ లో తిరుగు లేని మెగాస్టార్ రేంజ్ కి వెళ్లిపోయాడాయన. బాలీవుడ్ లో తన పోకిరి సినిమాని వాంటెడ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ తో ఒక్క సినిమా చెయ్యాలని పూరి జగన్నాథ్ చాలా సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాడు..కానీ ఎందుకో అప్పట్లో కుదర్లేదు కానీ ఇప్పుడు కుదిరింది అనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు..ఇటీవలే పూరి జగన్నాథ్ సల్మాన్ ఖాన్ ని కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పాడట..సల్మాన్ ఖాన్ కి ఆ స్టోరీ లైన్ తెగ నచ్చేసినట్టు సమాచారం.

Salman Khan
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మళ్ళీ విజయ దేవరకొండ తోనే ‘JGM ‘ అనే సినిమా చేస్తున్నాడు..ఈ చిత్రం పూర్తి అవ్వగానే సల్మాన్ ఖాన్ తో సినిమా ఉంటుంది అని బాలీవడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త..ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ సినిమా ఈ నెల 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల కాబోతుంది..దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభించగా ప్రతి చోట అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది..బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్స్ లాగ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
