MS Dhoni Birthday: భారత్ క్రికెట్ కు గర్వ కారణం ధోనీ.. హీ ఈజ్ లెజెండ్..!

భారత క్రికెట్ జట్టు ప్రయాణాన్ని ధోని కి ముందు, ధోనీకి తరువాతగా విభజించవచ్చు. ఎందుకంటే భారత క్రికెట్ పై మహేంద్ర సింగ్ ధోని తనదైన ముద్ర వేశాడు.

  • Written By: BS
  • Published On:
MS Dhoni Birthday: భారత్ క్రికెట్ కు గర్వ కారణం ధోనీ.. హీ ఈజ్ లెజెండ్..!

MS Dhoni Birthday: భారత క్రికెట్ జట్టు చరిత్రలో ధోని కెప్టెన్సీ నిర్వహించిన కాలాన్ని క్రికెట్ అభిమానులు స్వర్ణ యుగంగా భావిస్తారు. ఎందుకంటే ధోని భారత జట్టుకు కెప్టెన్సీగా వ్యవహరించిన కాలంలో ఐసీసీ నిర్వహించిన అనేక మెగా టోర్నీల్లో భారత జట్టును విజేతగా నిలిపాడు. తన వ్యూహ చతురత, అంతకు మించి జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించిన కార్యదక్షత వెరసి ధోనీ కెప్టెన్ గా ఉన్న కాలంలో భారత జట్టు అద్వితీయ విజయాలను నమోదు చేసుకుంది. భారత జట్టు క్రికెట్ చరిత్రలో మరో క్రికెటర్ కు సాధ్యం కాని రీతిలో రెండు వరల్డ్ కప్పులను జట్టుకు అందించి అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు మహేంద్రసింగ్ ధోని.

భారత క్రికెట్ జట్టు ప్రయాణాన్ని ధోని కి ముందు, ధోనీకి తరువాతగా విభజించవచ్చు. ఎందుకంటే భారత క్రికెట్ పై మహేంద్ర సింగ్ ధోని తనదైన ముద్ర వేశాడు. ధోని ఐసీసీ నిర్వహించిన రెండు వరల్డ్ కప్పులతో పాటు, ఛాంపియన్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర వహించాడు. ఒక భారత కెప్టెన్ ఐసీసీ నిర్వహించిన మూడు మెగా ట్రోఫీలను సొంతం చేసుకున్న ఘనత ధోనీకి మాత్రమే దక్కింది. ఈ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు శుక్రవారం కాగా, ‘ఒకే ఒక్కడు మహేంద్ర సింగ్ ధోని’ అంటూ ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్ చేయగా.. దీనికి పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

2004లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ప్రారంభం..

ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ 2004లో ప్రారంభమైంది. అప్పటికి భారత జట్టు వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్న దినేష్ కార్తీక్, పార్థివ్ పటేల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో ధోనీకి అవకాశం దక్కింది. 2004-2005 మధ్య కాలంలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు కీపర్ గా ధోని ఎంపిక అయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కీపర్ స్థానాన్ని దక్కించుకున్నాడు. తన తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. తొలి సిరీస్ లో ధోని సాధారణమైన ప్రదర్శన ఇచ్చాడు. అయినప్పటికీ అతనిపై నమ్మకం ఉంచిన మేనేజ్ మెంట్ ఆ వెంటనే పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ కు ధోనీని ఎంపిక చేశారు. పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో ధోనీ చెలరేగిపోయాడు. పాక్ సిరీస్ ఐదో వన్డేలో మొదటి సెంచరీని కొట్టాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 123 బంతుల్లో ధోని 148 పరుగులు చేసి ఆధరగొట్టాడు. ఆ తరువాత నుంచి ధోని వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో వన్డే అరంగేట్రం చేసిన ధోని.. తన చివరి మ్యాచ్ ను 2019 జూలైలో న్యూజిలాండ్ పై ఆడాడు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయిన ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక టి20 కెరియర్ పరిశీలిస్తే.. 2006 లో దక్షిణాఫ్రికాపై తొలి టి20 మ్యాచ్ ఆడిన ధోని.. 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చివరి టి20 మ్యాచ్ ఆడాడు. అదే విధంగా టెస్ట్ కొరియర్ పరిశీలిస్తే.. 2005లో శ్రీలంక పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరి టెస్ట్ మ్యాచ్ ను 2014 డిసెంబర్ లో ఆస్ట్రేలియాపై ఆడి టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇవీ ఘనతలు..

ధోనీ సారధ్యంలో భారత గట్టు 2011 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2007 లో టి20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టును నిలిపాడు ధోనీ. దక్షిణాఫ్రికా విజయం సాధించి టి20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు నిలిచింది. 2014లో భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. అలాగే, ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా 2013లో భారత జట్టు ను ధోనీ నిలిపాడు. 2017లో ఇంగ్లాండ్ పై ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. అలాగే, ధోని సారధ్యంలో మూడుసార్లు ఆసియా కప్ విజేతగా భారత జట్టు నిలిచింది. 2010, 2016, 2018లో ఇండియాను ధోనీ విజేతగా నిలిపాడు. 2008లో రెండవ స్థానంలో నిలిచింది.

ఇదీ ధోనీ కెరియర్..

మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు 90 టెస్ట్ మ్యాచ్లు ఆడగా 38.09 సగటుతో 4,876 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 256 క్యాచ్ లు, 38 స్టంప్ ఔట్లు ఉన్నాయి. వన్డే కెరియర్ లో 350 వన్డే మ్యాచ్ లు ఆడిన ధోని 50.57 సగటుతో 773 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 183 పరుగులు కాగా, 10 సెంచరీలు, 73 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 321 క్యాచ్లు అందుకొని, 123 స్టంప్ ఔట్లు చేశాడు. అలాగే టి20 కెరీర్ లో 98 మ్యాచ్ లు ఆడిన ధోని 37.61 సగటుతో 1617 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 56 పరుగులు కాగా, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. 57 క్యాచ్ లు అందుకోగా, 34 స్టంప్ ఔట్లు చేశాడు.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు