Viral Video: సృష్టిలో అమ్మ ప్రేమ కంటే తీయనైనది లేదు. అన్నింట్లో కల్తీ వస్తున్నా అమ్మ ప్రేమలో మాత్రం ఎలాంటి స్వార్థం, కల్మషం ఉండవు. దీంతో జంతువులైనా మనుషులైనా ఒకే రకమైన ప్రేమ వ్యక్తపరుస్తుంటారు. తన బిడ్డ కోసం సర్వస్వం ధారపోస్తారు. పురిటినొప్పులు పునర్జన్మతో సమానమని అందరు చెబుతుంటారు. అందుకే స్త్రీని భూదేవితో సమానంగా కొలుస్తారు. అంతటి మహత్తర శక్తిగల ఆడవారు తమ పిల్లల సంక్షేమానికి జీవితాన్నే పణంగా పెడుతుంది. మహిళలు లేకపోతే ప్రపంచమే లేదనే విషయం అందరికి తెలుసు. అందుకే వారికి కుటుంబంలో సముచిత స్థానం ఇస్తుంటారు. సంసారం నడవాలంటే ఆడవారు కచ్చితంగా ఉంటేనే సాధ్యమవుతుంది.

Viral Video
పుట్టిన బిడ్డల కోసం తల్లి ఎన్నో విధాలుగా పరితపిస్తుంది. తన కడుపు పండటానికి కారణమైన వారిని ఎంతో ప్రేమగా చూస్తుంది. అమ్మ స్పర్శతో ఎన్నో అద్భుతాలు జరిగాయని గతంలో జరిగిన పలు సంఘటనలు రుజువు చేశాయి. అమ్మ చేతిలో ఉండే మహిమ అలాంటిది మరి. ఈ నేపథ్యంలో అమ్మ తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తాను తిన్నా లేకున్నా పస్తులుండి మరీ వారిని పెంచుతుంది. వారిలోని ఎదుగుదల చూసి ముచ్చట పడుతుంది. తన కలలు నిజం చేసిన పిల్లల క్షేమానికి నిరంతరం శ్రమిస్తుంది.
ఇక్కడ ఓ వీడియో వైరల్ గా మారింది. పుట్టిన బిడ్డ ప్రాణాలతో ఉన్నాడో తెలియని సందిగ్ధంలో ఉండగా తల్లి ఎత్తుకుని తన గుండెకు హత్తు కోవడంతో పుట్టిన బిడ్డ ఏడుపు లంకించుకుంది. తల్లి ప్రేమలో ఇంతటి మహత్తర శక్తి ఉందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. తల్లి స్పర్శకు తన్మయత్వంతో శిశువు ఏడ్వడం అందరిలో అయోమయ కలిగించింది. ఇక లేదనుకున్న పాప ఒక్కసారిగా ఉలిక్కిపడటం గమనార్హం. అమ్మ ప్రేమలో అంతటి కమ్మదనం ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా.

Viral Video
ఇలా అమ్మలోని చేతికి అంతటి అనితర సాధ్యమైన ప్రేమ దాగి ఉంటుంది. ఇలాంటి ఘటనలు కూడా గతంలో చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలో పుట్టిన పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం సురక్షితమని వైద్యులు కూడా చెబుతున్నారు. అందుకే పిల్లలను బతికించడంలో తల్లిదే ప్రధాన పాత్ర. తండ్రి అన్ని అవసరాలు సమకూర్చినా ప్రేమ మాత్రం తల్లి ఇస్తుంది. అందుకే అమ్మకంటే మించిన దైవం లేదని చెబుతుంటారు. అమ్మ మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అదే తల్లి ప్రేమతో మనకు ఎన్నో విధాలైన రోగాలు సైతం దూరం అవుతాయి.
https://www.facebook.com/100030546853986/videos/1262123584344961/