https://oktelugu.com/

Sai Pallavi: సడన్ గా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. అభిమానులంతా షాక్?

Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ వరుసగా రెండు విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించిన లవ్ స్టోరీ, అలాగే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి. ఈ సినిమాలో సాయి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 30, 2021 / 02:13 PM IST
    Follow us on

    Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ వరుసగా రెండు విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించిన లవ్ స్టోరీ, అలాగే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి. ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసి పాత్రలో కనిపించారు.

    Sai Pallavi

    ఇకపోతే డిసెంబర్ 24వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో సాయిపల్లవి ఈ సినిమాని చూడటం కోసం పెద్ద సాహసమే చేశారు. ఈమె ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బుర్ఖా ధరించి హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ వద్దకు వెళ్లారు. ఇలా బుర్ఖాలో వెళ్లిన ఈమె ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన అనంతరం బయటకు వస్తుండగా సరాసరి ఒక రిపోర్టర్ ఈమె వద్దకు వెళ్లి సినిమా గురించి రివ్యూ అడిగారు. అయితే రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లారు.

    Also Read:  ఎప్పుడైనా ఇలియానా తల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందో!

    ఒక వ్యక్తితో కలిసి థియేటర్ కి వచ్చిన సాయి పల్లవి అనంతరం కారులో తిరిగి వెళ్తున్న సమయంలో తన ఐడెంటిటీ రివీల్ చేయడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయ్యో సాయి పల్లవితో సెల్ఫీ తీసుకోలేకపోయామని కొందరు ఫీల్ అవ్వగా ఈమె ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రావడం చూసి మరికొందరు ఆశ్చర్యపోయారు. అయితే ఆమెను ఎవరు గుర్తించలేదు కనుక సరిపోయింది లేకపోతే అభిమానులను కంట్రోల్ చేయడం సాధ్యమయ్యే పని కాదని కొందరు భావిస్తున్నారు.

    Also Read:  చిరంజీవి సీఎం కల.. అసలు ఎలా పుట్టింది?