Diving cricket shot : అరె ఏంట్రా ఈ డైవింగ్ షాట్.. సూర్యకుమార్‌నే మించిపోయావ్..!!
కానీ ఓ బుడ్డోడు అంతకుమించిన షాట్ ను కనిపెట్టాడు. సూర్యకుమార్ నే మించిపోయాడు. తాజాగా ఓ గల్లీ క్రికెట్‌లో బుడ్డోడు ఆడిన క్రికెట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Diving cricket shot : టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. కాస్త తెలివి, వినూత్న ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో తోపు.. తీస్మార్‌ఖాన్ అవుతారు. మన సూర్యకుమార్ యాదవ్ కూడా వినూత్న షాట్లతో నలువైపులా కొడుతూ మిస్టర్ 360గా మారాడు. అతడి షాట్లుకొడుతుంటే బాడీని అలా వంచుతుంటే ఇవేం షాట్లు అని అందరూ నోరెళ్లబెడుతారు. కానీ ఓ బుడ్డోడు అంతకుమించిన షాట్ ను కనిపెట్టాడు. సూర్యకుమార్ నే మించిపోయాడు. తాజాగా ఓ గల్లీ క్రికెట్‌లో బుడ్డోడు ఆడిన క్రికెట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో తప్పకుండా టీం ఇండియాకు స్ఫూర్తిగా నిలుస్తుదంటున్నారు. ఇంతకీ ఆ బుడ్డోడు ఏం చేశాడు.. ఎలా ఆడాడో చూద్దాం..
ఇన్నోవేషన్ గేమ్…
క్రికెట్ అనేది ఆవిష్కరణ ఎల్లప్పుడూ పెద్ద ప్రభావాన్ని చూపే ఆట. ఇది మార్పులను, కొత్త దనాన్ని ఆహ్వానిస్తుంది. ఫార్మాట్ వారీగా లేదా నియమాల వారీగా ఆడి ఎంతోమంది క్రికెటర్లు ఆటలో కొత్తదనాన్ని పరిచయం చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్‌లో ఆకట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఒక పిల్లవాడు పిచ్ నుంచి ఎదురౌతున్న ఇబ్బందిని అధిగమించేందుకు ప్రత్యేకమైన టెక్నిక్ ఉపయోగించాడు. బంతి పిచ్‌పై పడకముందే ముందుకు డైవ్ చేసి షాట్ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకట్టుకున్న ఈ షాట్‌ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ వేళ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విడియోను చాలా మంది లైక్, షేర్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా పెడుతున్నారు. స్కైకా బచ్‌పన్ అని ఒకరు.. అటాకింగ్ షాట్ అని మరొకరు. విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీలో ఇలా ఆడాలని కొందరు, వచ్చే ఐపీఎల్‌లో ఇలాంటి షాట్స్ చూస్తాం అని మరికొందరు.. సూర్యకుమార్ ఈ షాట్ ట్రై చేస్తాడని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్ గల్లీ క్రికెట్ అని, రబ్బర్ బాల్ కాబట్టి అలా ఆడాడని కూడా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా డబ్ల్యూటీసీ ఫైనల్ వేళ ఈ షాట్ నెటిజన్లను, క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంతా రెడీ..
ఇక ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైలన్‌కు అంతా రెడీ అయింది. బుధవారం ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత టెస్టు జట్టు తమ సొంత మైదానంలో రెండుసార్లు ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో డబ్ల్యూటీసీలో టీం ఇండియాను ఓడించాలన్న కసితో ఆస్ట్రేలియా ఉంది. 2018–19 మరియు 2020–21 ఎడిషన్‌లలో బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో 2–1 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి తెలిపారు. ‘ప్రారంభంలో పోటీ తీవ్రంగా ఉంది.. వాతావరణం కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. కానీ మేము ఆస్ట్రేలియాలో రెండుసార్లు గెలిచినందున, పోటీ గౌరవంగా మారింది.. టెస్ట్ జట్టుగా మమ్మల్ని ఇకపై తేలికగా తీసుకోలేదు‘ అని కోహ్లీ చెప్పాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 6, 2023
