Morocco Earthquake: పెను ‘ఉప్పెన’.. 20వేల మంది మృతి.. శశ్మానంగా మారిన ఆ దేశం

తూర్పు లిబియా మంత్రి మహ్మద్‌ అబు–లమౌషా మాట్లాడుతూ.. ‘మధ్యధరా సముద్రంలో తలెత్తిన డేనియల్‌ తుఫాను ఇంతటి భీభత్సాన్ని సృష్టించింది.

  • Written By: Bhaskar
  • Published On:
Morocco Earthquake: పెను ‘ఉప్పెన’.. 20వేల మంది మృతి.. శశ్మానంగా మారిన ఆ దేశం

Morocco Earthquake: ఆఫ్రికా దేశాలపై ప్రకృతి కన్నెర్రజేస్తోంది. మొన్న మొరాకో భూకంపంతో అతలాకుతలం కాగా, నిన్న లిబియాలో స్టార్మ్‌ డేనియల్‌ తుఫాను లిబియాలో భీభత్సం సృష్టించింది. ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో సంభవించిన ఈ తుఫాను ఆ రాష్ట్ర రూపురేఖలను మార్చివేసింది. తూర్పు నగరమైన డెర్నాలో గడచిన 24 గంటల్లో 20 వేల మంది మృత్యువాత పడినట్లు అల్‌–బైదా మెడికల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ రహీమ్‌ తెలిపారు. అధికారిక లెక్కలు చెప్పేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. సముద్రంలో ఎన్నో మృతదేహాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా డెర్న్‌ నగరం కకావికలమైందని వెల్లడించారు. వేలాది మందిని సామూహిక ఖననం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా 5,300 మందిని గుర్తించినట్లు వెల్లడించారు. పది వేల మంది ఆచూకీ దొరకడం లేదన్నారు. ఈ సంఖ్య రెండింతలు ఉంటుందని తెలిపారు.

లిబియా రూపురేఖలు మార్చేసిన తుపాన్‌..
ఈ తుపాన్‌ ప్రభావంతో భయంకరమైన వరద లిబియా రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. శాటిలైట్‌ పంపిన తాజా ఫొటోలు అక్కడి పరిస్థితిని అద్దం పడుతోంది. నదుల ఆనకట్టలు తెగడంతో నీళ్లు నగరాలు, గ్రామాలను వరదలు ముంచెత్తాయి. ఒక్క డెర్నా నగరంలోనే 5 వేల మందికి పైగా మరణించిటన్లు అంచనా.

భారీగా నష్టం..
తూర్పు లిబియా మంత్రి మహ్మద్‌ అబు–లమౌషా మాట్లాడుతూ.. ‘మధ్యధరా సముద్రంలో తలెత్తిన డేనియల్‌ తుఫాను ఇంతటి భీభత్సాన్ని సృష్టించింది. చాలా చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ మొత్తంలో నీళ్లు నగరంలోకి ప్రవేశించింది. ఆనకట్టలు తెగిపోయాయి. వంతెనలు విరిగిపోయాయి. ఇంత దారుణమైన విధ్వంసం ఇంతకు మునుపెన్నడూ సంభవించలేదు’ అని వివరించారు.

పాలనా వైఫల్యంతో..
హరికేన్‌ డేనియల్‌ను మెడికేన్‌ అని కూడా పిలుస్తారు. లిబియాలో పరిపాలన యంత్రాంగం కూడా భారీ నష్టానికి మరో కారణం. ఈ దేశాన్ని రెండు ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ఒకటి తూర్పు తీరం వైపు, మరొకటి పశ్చిమం వైపు. దీని కారణంగా లిబియాలో మౌలిక సదుపాయాలపై ఎవరూ శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం డెర్నాలో సహాయక చర్యలు చేపడుతున్నారు. డెర్నా సముద్ర తీరం వెంబడి ఉన్న ఓ నగరం. ఈ నగరంలో సుమారు 89 వేల మంది నివసిస్తున్నారు. కానీ తుఫాను కారణంగా ఏర్పడిన సముద్రపు వరద, వర్షం కారణంగా హఠాత్తుగా రోడ్లు, వంతెనలు విరిగిపోయాయి. చాలా చోట్ల సామూహిక శ్మశానవాటికలు నిర్మిస్తున్నారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీస్‌ లిబియా రాయబారి తామెర్‌ రంజాన్‌ చెప్పారు. అనేక మంది ప్రజలు వరదల్లో గల్లంతయ్యారు. 10 వేల మందికిపైగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. లిబియాలో ఇంతటి బలమైన తుఫాను గతంలో ఎన్నడూ సంభవించలేదు.

Read Today's Latest International politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు