Hyderabad: ఫంక్షన్లలో అమ్మాయిలతో డ్యాన్సులు వేయించడం చూశాం. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి డ్యాన్సు చేయడం చూసి ఉంటాం. కానీ ఒక అబ్బాయి మరో అబ్బాయి బట్టలు చించి.. శరీరాన్ని టచ్ చేస్తూ.. ముద్దులు పెడుతూ డ్యాన్స్ చేయించడం ఎప్పుడూ చూసి ఉండం. ఇలాంటి పైశాచిక ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఓ రౌడీషీటర్ పైశాచికానందం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Hyderabad
హైదరాబాద్ నగరంలోని బార్కస్ సలాల నివాసి.. అలీ-బా-ఈసా. అతని పై చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. ఇటీవల ఓ యువకుడితో అలీ బట్టలిప్పించి డ్యాన్స్ చేయించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అలీ తరచూ ముజ్రాలు చేస్తూ మద్యం సేవించి కత్తితో బెదిరించి యువకులతో డ్యాన్స్ చేయిస్తాడని వీడియోలోని బాధితుడు చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు అలీ పై కేసు నమోదు చేశారు.
అలీ పైశాచికత్వానికి అంతులేదు. అబ్బాయిల బట్టలు చించి డ్యాన్సులు చేయిస్తాడు. అబ్బాయిల శరీరాన్ని టచ్ చేస్తూ.. ముద్దులు పెడుతూ .. కేవలం అండర్ వేర్ పై డ్యాన్సులు చేయాలంటూ బెదిరిస్తాడు. ఇతని పైశాచికత్వానికి బాధితులు విలవిలాడిపోతారని చెప్పవచ్చు. అలీ పైశాచికత్వానికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావడంతో అలీ బండారం బయటపడింది. ఇటీవల పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ సందర్భంగా నడిరోడ్డు పై కత్తితో హల్ చల్ చేశాడు అలీ. మరో రౌడీషీటర్ సులేమాన్ బామ్ పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు.

Hyderabad
రౌడీషీటర్ అలీ-బా-ఈసా తరచూ మద్యం సేవించి గొడవలకు దిగుతాడు. స్థానికుల పై అరాచకాలకు పాల్పడుతుంటాడు. బట్టలిప్పించి డ్యాన్సు చేయించిన ఘటనతో పాటు హత్యాయత్నం కేసు కూడ అలీ పై నమోదైంది. దీంతో అలీ-బా-ఈసా పోలీసుల ముందు లొంగిపోయినట్టు సమాచారం.