Monsoon Care Tips: వానాకాలంలో వీటితో జాగ్రత్త
దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటికి ఆవాసాలే కరువయ్యాయి. చెట్లుచేమలు లేకుండా పోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విష జంతువులు దర్శనమిస్తుండటంతో జంకుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడుతుండటంతో చెత్త, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉంటున్న పాములు జనావాసాల్లోకి రావడంతో ఆందోళన కలుగుతోంది.

Monsoon Care Tips: ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైంది. వర్షాలు పడుతున్నాయి. దీంతో పురుగులు, క్రిములు, కీటకాలు విజృంభిస్తున్నాయి. చల్లగా వాతావరణం ఉండటంతో అవి బయటకు వస్తున్నాయి. ఇళ్లలోకి వెళ్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎటు చూసినా వాటి కదలికలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు బొక్కల్లో బొరియల్లో ఉండే విష జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి.
దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటికి ఆవాసాలే కరువయ్యాయి. చెట్లుచేమలు లేకుండా పోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విష జంతువులు దర్శనమిస్తుండటంతో జంకుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడుతుండటంతో చెత్త, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉంటున్న పాములు జనావాసాల్లోకి రావడంతో ఆందోళన కలుగుతోంది.
హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వివిధ జాతులకు చెందిన 250 పాములను అటవీ అధికారులు పట్టుకున్నారంటే విష పురుగుల ప్రభావం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. విష పురుగులు సంచరించడం వల్ల కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
వర్షాలు రైతులకు ఆనందం తెస్తున్నా ప్రజలకు మాత్రం కష్టాలే తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పాములు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. విష సర్పాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని మన పరిసర ప్రాంతాల్లో సంచరించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. విష పురుగుల బారినుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది.