Credit Card: క్రెడిట్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు.. త్వరపడండి
మనీ ట్రాన్సాక్షన్ కోసం ఇప్పుడు ప్రతీ ఒక్కరూ క్రెడిట్ కార్డు ను యూజ్ చేస్తున్నారు. అవసరానికి డబ్బులు అందించడంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తుండడంతో చాలా మంది వివిధ బ్యాంకుల నుంచి వీటిని పొందారు.

Credit Card: ఈరోజుల్లో అవసరానికి డబ్బు ఇచ్చేవాళ్ల సంఖ్య తక్కువైంది. కరోనా తరువాత ప్రతి ఒక్కరూ చేతిలో డబ్బు ఉంచుకోవాలని చూస్తున్నారు. దీంతో ఎక్కువ వడ్డీ ఇస్తామన్నా అప్పుడు ఇవ్వడం లేదు. అయితే బ్యాంకులు కొన్ని పరిమితులతో వడ్డీ లేకుండా తక్కువ మొత్తంలో అప్పు ఇస్తుంది. ఇవి నగదు రూపంలో కాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా ఇస్తుంది. క్రెడిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేయొచ్చు.. కొంత రుణాన్ని తీసుకోవచ్చు. కొంత వ్యవధితో ఇచ్చిన ఈ రుణాన్ని తిరిగి సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఇతరులను అప్పు అడిగే బదులు బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు.
మనీ ట్రాన్సాక్షన్ కోసం ఇప్పుడు ప్రతీ ఒక్కరూ క్రెడిట్ కార్డు ను యూజ్ చేస్తున్నారు. అవసరానికి డబ్బులు అందించడంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తుండడంతో చాలా మంది వివిధ బ్యాంకుల నుంచి వీటిని పొందారు. బ్యాంకులు సైతం మునుపటి లాగా పెద్దగా రిస్ట్రిక్షన్ లేకుండా తక్కువ ఆదాయం ఉన్నవారికి తక్కువ లిమిట్ తో కార్డులను అందిస్తుంది. అయితే లేటేస్టుగా ఓ బ్యాంకు క్రెడిట్ ద్వారా అదనపు సేవలను జోడించింది. ఇప్పటి వరకు మనీ ట్రాన్సాక్షన్ విషయంలో అకౌంట్లో డబ్బులు ఉంటేనే యూపీఐ ద్వారా సేవలు నడిచేవి. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డులకు సైతం యూపీఐ సేవలను కొత్తగా యాడ్ చేశారు.
ఎన్ పీ సీఐ అంగీకారంతో క్రెడిట్ ఆన్ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కీవీ అనే సంస్థ తెలిపింది. యాక్సిస్ బ్యాంకుతో ఒప్పంద చేసుకున్న కివీ.. ఈ బ్యాంకు అందించే క్రెడిట్ కార్డులతో యూపీఐ సేవలను పొందవచ్చు. దేశంలో ఇలా క్రెడిట్ కార్డు విత్ యూపీఐ సేవలను మొదటిసారిగా ఈ బ్యాంకు మాత్రమే తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. క్రెడిట్ మార్కెట్ లో కన్జ్యూమర్ మోడల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కీవీ సంస్థ తెలిపింది. కీవీ అనే కంపెనీ మొబైల్ అప్లికేషన్ల ద్వారా కస్టమర్లు తమ చెల్లింపులు చేయొచ్చు.
ప్రస్తుతం చాలా మంది తమ మొబైల్స్ లో యూపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. 2016లో మార్కట్లోకి వచ్చిన ఈ సేవలతో బ్యాంకులు కస్టమర్లకు మరింత చేరువయ్యాయి. ఇదిలా ఉండగా కీవీ ఇటీవలనే 6 మిలియన్ డార్లను సమీకరించింది. నెక్సస్ వెంచర్ పార్ట్ నర్స్, స్లెల్లారీస్ వెంచర్ పార్ట్ నర్స్ సహా వివిధ ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది. వచ్చే కాలంలో 1 మిలియన్ యూజర్లను పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఇప్పుడు క్రెడిట్ ఆన్ యూపీఐ సేవలను వీరికి అందుబాటులో ఉంచుతామని చెప్పింది.
కీవీ యూజర్లకు రూపే క్రెడిట్ కార్డు పొందవచ్చు. దీనిని యూపీఐ తో లింగ్ చేసుొకిన ఆ తరువాత క్రెడిట్ ఆన్ యూపీఐ సేవలను పొందవచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ సేవల ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. కీవీ యాప్ లో కార్డ్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. కార్డు బ్యాక్ చేయడం, క్రెడిట్ లిమిట్ పెంపు, పేమేంట్ చేయడం వంటివీ ఈ యాప్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఊహించని రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు.
