Mokshagna- Sreeleela: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తో శ్రీలీల రొమాన్స్..ఇదెక్కడి విడ్డూరం అండీ బాబోయ్!
ప్రస్తుతం ఆమె బాలయ్య బాబు హీరో గా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రం లో బాలయ్య కి కూతురిగా నటిస్తుంది. ఈ సినిమా సమయం లోనే బాలయ్య బాబు కి శ్రీలీల తెగ నచ్చేసిందట.

Mokshagna- Sreeleela: నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన అమెరికా లో యాక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. వచ్చే ఏడాది లోనే ఆయన మొదటి సినిమా లాంచింగ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మోక్షజ్ఞ మొదటి సినిమాకి సంబంధించిన డైరెక్టర్స్ గురించి సోషల్ మీడియా లో ఇది వరకే ఎన్నో వార్తలు వచ్చాయి.
కానీ ఏది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆయన మొదటి సినిమాకి డైరెక్టర్ ఎవరు అనే విషయాన్నీ కాసేపు పక్కన పెడితే, మొదటి సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ ని ఒక రేంజ్ లో దున్నేస్తున్న శ్రీలీల నే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని టాక్. ఇప్పటికే ఈ ఆమె ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట.
ప్రస్తుతం ఆమె బాలయ్య బాబు హీరో గా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రం లో బాలయ్య కి కూతురిగా నటిస్తుంది. ఈ సినిమా సమయం లోనే బాలయ్య బాబు కి శ్రీలీల తెగ నచ్చేసిందట. పెద్దల పట్ల శ్రీలీల కి ఉన్న గౌరవం, ఆమెలోని చాలాకితనం బాలయ్య బాబు కి బాగా నచ్చిందట. వచ్చే ఏడాది నా కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడు.వాడి మొదటి సినిమాలో నువ్వే హీరోయిన్ గా నటించాలి. మళ్ళీ డేట్స్ కుదర్లేదు లాంటి సాకులు చెప్పకూడదు ముందే చెప్తున్నా అని అన్నాడట.
దానికి శ్రీలీల నవ్వుతు మీరు ఏది చెప్తే అదే అంటూ సమాధానం చెప్పిందట. దీనితో డైరెక్టర్ కూడా ఖరారు కాని బాలయ్య మొదటి సినిమాకి హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది నిజం అవుతుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
