Mohan babu: తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు విలక్షణ నటుడిగా వెండితెర పై తనదైన ముద్రను వేశారు. విలన్ గా మొదలై.. కమెడియన్ గా మారి, హీరోగా ఎదిగి..మళ్లీ విలన్ గా – హీరోగా – క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా వైవిధ్యమైన కెరీర్ గ్రాఫ్ ను క్రియేట్ చేసుకున్నఏకైక తెలుగు హీరో కూడా ఒక్క మోహన్ బాబు మాత్రమే. అలాగే, సెంటిమెంట్ రోల్స్ లోనూ మోహన్ బాబు నటించి మెప్పించాడు. ఇంతటి ఘనమైన క్రేజ్ సంపాదించుకున్న మోహన్ బాబుకెరీర్లో ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. ఐతే, వాటన్నిటిలో కల్లా ఆయనపై ఇప్పటికీ మాయని మచ్చలా మిగిలిపోయిన దారుణమైన సంఘటన ఒకటి జరిగింది.

Mohan Babu
అది యమజాతకుడు సినిమా షూటింగ్ మొదలైనరోజు. హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో హీరో మోహన్ బాబు – హీరోయిన్ సాక్షి శివానంద్ లపై షూట్ మొదలైంది.మొదటి రెండు రోజులు షూటంగ్ బాగానే జరిగింది. మూడోరోజు ఉదయం హీరోయిన్ సాక్షి శివానంద్.. సెట్స్ లో అందరి ముందు మోహన్ బాబును ఏకవచనంతో బూతులు తిడుతూ పెద్దపెద్దగా అరుస్తోంది. ఏమైందా ? అని అక్కడ ఉన్న వారంతా అయోమయంగా చూస్తున్నారు. ఎదురుగా ఉన్న మోహన్ బాబు మాత్రం సాక్షి శివానంద్ వైపే చూస్తూ కోపంతో రగిలిపోతున్నారు. అంతకన్నా కోపంగా ఉంది సాక్షి శివానంద్. ఆమె ఆవేశంగా చెబుతూ.. ‘రాత్రి తాను ఉంటున్న హోటల్ కి మోహన్ బాబు వచ్చి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తాను ప్రతిఘటించడంతో తనను బలవంతంగా మానభంగం చేయడానికి ప్రయత్నించాడని సాక్షి శివానంద్, మోహన్ బాబు పై దారుణమైన ఆరోణలు చేసింది.
Also Read: Nandamuri Hero: సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నందమూరి హీరో
ఆమె మాటలు విన్న ఆ సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వెంటనే తేరుకుని దయచేసి పెద్దగాఅరవకండి అంటూ సాక్షి శివానంద్ కు నచ్చచెబుతూ ఉండగా.. అంతలో మోహన్ బాబు ఆవేశంగా వచ్చి ఆమెను అందరి ముందే లాగి పెట్టి కొట్టాడు. ఈ ఘటనతో షాక్తిన్న సాక్షి శివానంద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోయింది. ఇండస్ట్రీలో మోహన్ బాబు పై విమర్శలు మొదలయ్యాయి. దాంతో ఫ్రేమ్ లోకి నాగార్జునను తీసుకువచ్చాడు మోహన్ బాబు. పోలీసులకు ఫిర్యాదు అంటే సినిమాకు నష్టం వస్తుందని, ఇండస్ట్రీకే అవమానం అని ఎట్టకేలకు హీరో నాగార్జున కలగ జేసుకుని సాక్షి శివానంద్ ను బుజ్జగించాడు.
ఆ తర్వాత చాలా కండిషన్ల మధ్య కేవలం కొన్ని రోజులు మాత్రమే మోహన్బాబు సినిమాకి డేట్స్ ఇచ్చింది సాక్షి. ఆ తరవాత సాక్షి శివానంద్ మళ్లీ ఎన్నడూ మోహన్ బాబు ఉన్న సినిమాలో నటించలేదు. ఈ క్రమంలోనే సాక్షి శివానంద్ టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకునిఇండస్ట్రీకి దూరమైంది. కానీ మోహన్ బాబు పై మాత్రం ఈ మచ్చ పుట్టుమచ్చ లాగా నిలిచిపోయింది.
Also Read: Tollywood : థియేటర్ కు ఎందుకు రావడం లేదు? తప్పు ప్రేక్షకులది కాదు.. టాలీవుడ్ దే..!
Recommended Videos