Mohan Babu: మోహన్ బాబుకు గొడవలు మనోజ్ తో కదా! విష్ణుతోనా?
Mohan Babu: సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీపై రోజుకో వదంతు పుట్టుకొస్తుంది. తాజాగా ఆయనకు మంచు విష్ణుతో చెండిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే నిదర్శనం అంటూ కొన్ని అంశాలు తెరపైకి తెస్తున్నారు. చిన్న కుమారుడు మంచు మనోజ్ భూమా మౌనికకు దగ్గరైనప్పటి నుండి పలు పుకార్లు తెరపైకి వచ్చాయి. మోహన్ బాబు,విష్ణులతో గొడవ పడిన మనోజ్ ఇంటి నుండి వెళ్లిపోయాడని, ఆయన హైదరాబాద్ లో ఉండటం లేదంటూ కథనాలు వెలువడ్డాయి. మనోజ్ తన ప్రేయసి భూమా […]


Mohan Babu, Manoj, With Vishnu
Mohan Babu: సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీపై రోజుకో వదంతు పుట్టుకొస్తుంది. తాజాగా ఆయనకు మంచు విష్ణుతో చెండిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే నిదర్శనం అంటూ కొన్ని అంశాలు తెరపైకి తెస్తున్నారు. చిన్న కుమారుడు మంచు మనోజ్ భూమా మౌనికకు దగ్గరైనప్పటి నుండి పలు పుకార్లు తెరపైకి వచ్చాయి. మోహన్ బాబు,విష్ణులతో గొడవ పడిన మనోజ్ ఇంటి నుండి వెళ్లిపోయాడని, ఆయన హైదరాబాద్ లో ఉండటం లేదంటూ కథనాలు వెలువడ్డాయి. మనోజ్ తన ప్రేయసి భూమా మౌనికతో సన్నిహితంగా ఉండటం, పెళ్లి చేసుకుంటానని అనడం మోహన్ బాబుకు నచ్చడం లేదని, అందుకే గొడవలు అంటూ వాదనలు వినిపించాయి.
Also Read: Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాతో పాటు మరో షూట్ లో మహేష్… కిక్ ఇచ్చేలా లుక్, ఇంతకీ మేటర్ ఏంటి?
ఈ కథనాలను బలపరిచే విధంగా మనోజ్ వివాహం జరిగింది. అన్నయ్య విష్ణు మనోజ్ వివాహాన్ని పట్టించుకోలేదు. నవ దంపతులతో కలిసి ఫోటోలు దిగలేదు. మోహన్ బాబు మాత్రం పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు వచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. మోహన్ బాబు, విష్ణులు మనోజ్ పెళ్లి ఏర్పాట్లు పట్టించుకోలేదు. అక్కయ్య మంచు లక్ష్మి మనోజ్ పెళ్లి బాధ్యత తీసుకున్నారు. తన నివాసంలో వేడుక నిర్వహించారు.
ఇదిలా ఉంటే జనవరి 19న మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో మంచు విష్ణు కనిపించకపోవడం కొత్త చర్చకు దారితీసింది. మోహన్ బాబు పుట్టినరోజు కార్యక్రమాల్లో మంచు లక్ష్మి, మనోజ్, మౌనిక చురుకుగా పాల్గొన్నారు. గుడికి వెళ్లడం, ప్రత్యేక పూజలు చేయడం చేశారు. విష్ణు కానీ ఆయన భార్య కానీ మోహన్ బాబుతో కనిపించలేదు. తండ్రికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బర్త్ డే వేళ మోహన్ బాబు పక్కన విష్ణు లేకుండా మనోజ్ మాత్రమే కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Mohan Babu, Vishnu
ఈ క్రమంలో మనోజ్ కారణంగా మోహన్ బాబు-విష్ణు మధ్య మనస్పర్థలు తలెత్తాయని అంటున్నారు. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదట కానీ టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. నటుడిగా మోహన్ బాబు హైట్స్ చూశారు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి భిన్నమైన పాత్రలు చేశారు. కొడుకుల విషయంలో ఆయనకు నిరాశ ఎదురైంది. ఇద్దరు కుమారుల్లో ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. ఇది ఆయన్ని వేధిస్తున్న పరిణామం. అయితే విష్ణు, మనోజ్ అలుపెరుగని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వెండితెరపై కనిపిస్తున్నారు.
Also Read:Taraka Ratna: తారకరత్న ఏకంగా సీఎం భార్యతో రొమాన్స్ చేశాడా? బయటకొచ్చిన షాకింగ్ మేటర్!