Mohan Babu: వీడియో: మోహన్ బాబు నోటి దురుసు… బుద్ధి లేదా అంటూ పబ్లిక్ లో రచ్చ!
ఇటీవల మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు చోటు చేసుకున్నాయి. చిన్న కుమారుడు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. భూమా మౌనికతో మనోజ్ వివాహం జరిగింది. ఈ పెళ్లి మోహన్ బాబు, విష్ణులకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఈ పుకార్లను బలపరిచే సంఘటనలు జరిగాయి. మనోజ్-మౌనిక పెళ్లి బాధ్యత అక్క మంచు లక్ష్మి తీసుకుంది. మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3న మనోజ్ పెళ్లి జరిగింది.

Mohan Babu: నటుడు మోహన్ బాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో ఆయన సహనం కోల్పోయారు. మీడియాపై మండి పడ్డారు. చాలా కాలం తర్వాత మోహన్ బాబు పబ్లిక్ లో కనిపించారు. ఆయన షాద్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చారు. మోహన్ బాబు రాకను తెలుసుకున్న మీడియా చుట్టుముట్టారు. ఆయన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. మీడియా తీరుపై మోహన్ బాబు మండిపడ్డారు. ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు చోటు చేసుకున్నాయి. చిన్న కుమారుడు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. భూమా మౌనికతో మనోజ్ వివాహం జరిగింది. ఈ పెళ్లి మోహన్ బాబు, విష్ణులకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఈ పుకార్లను బలపరిచే సంఘటనలు జరిగాయి. మనోజ్-మౌనిక పెళ్లి బాధ్యత అక్క మంచు లక్ష్మి తీసుకుంది. మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3న మనోజ్ పెళ్లి జరిగింది.
ఈ వేడుకకు విష్ణు దూరంగా ఉన్నారు. మోహన్ బాబు చివరి నిమిషంలో హాజరై దంపతులను ఆశీర్వదించాడు. పెళ్లయ్యాక మనోజ్ ఒకటి రెండు సందర్భాల్లో ఇదే విషయం వెల్లడించారు. మౌనికను పెళ్లి చేసుకునేందుకు యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఏడాదిన్నర పాటు చెన్నైలో ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మంచు బ్రదర్స్ మధ్య విబేధాలున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాల నడుమ విష్ణు తనతో గొడవపడుతున్న వీడియో మనోజ్ నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబుతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది. మోహన్ బాబు చిరాకు పడ్డారు. మీకు బుద్ధి లేదా అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళ మైకులు లాక్కోండి అంటూ అసిస్టెంట్స్ కి చెప్పాడు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. చివరిగా మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ప్రధాన పాత్ర చేసిన అగ్ని నక్షత్రం మూవీలో కీలక రోల్ చేసినట్లు సమాచారం.
డైలాగ్ కింగ్ అయితే సరిపోదు మాటలు కూడా బావుండాలి..??
షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు బుద్ధి లేదా అంటూ మీడియాపై చిందులు..లోగోలు లాక్కోండి అంటూ తన బౌన్సర్లకు మోహన్ బాబు ఆదేశం. pic.twitter.com/pGe8oGLsxb
— HEMA (@Hema_Journo) July 13, 2023