Mohan Babu – Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టామ్ & జెర్రీ లాగా ఉండే స్నేహితులు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి మరియు మోహన్ బాబు.వీళ్ళిద్దరూ ఎన్నో సందర్భాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మనం గమనించాము.ముఖ్యంగా వజ్రోత్సవ వేడుకలలో వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి.
ఇదే విషయాన్నీ రీసెంట్ గా మోహన్ బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో విలేఖరి అడిగిన ప్రశ్న కి మోహన్ బాబు సమాధానం ఇస్తూ ‘ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరమా.ఆ తర్వాత మా మధ్య ఉన్న విబేధాలు అన్నీ తొలగిపోయాయి.మేము ఇద్దరం మంచి స్నేహితులం’ అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.అయితే గత ఏడాది మా ఎన్నికలు జరిగినప్పుడు మోహన్ బాబు మరియు చిరంజీవి మధ్య కాస్త విబేధాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే.మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న నేపథ్యం లో జరిగిన కొన్ని సంఘటనలు వీళ్లిద్దరి మధ్య కాస్త దూరం పెంచింది.
ఇదే విషయాన్నీ మోహన్ బాబు ని విలేకరి అడుగుతూ ‘అప్పట్లో మా ఎన్నికల సమయం లో మీ ఇద్దరి మధ్య వాడివేడి వాతావరణం నెలకొంది కదా’ అని అడగగా దానికి మోహన్ బాబు సమాధానం ఇస్తూ ‘ఆ విషయం లో నాకు ఇప్పటికీ కాస్త బాధ ఉంది,అలా జరిగి ఉండకూడదు,తప్పు నాదా, లేదా తనదా? అనే విషయం పై చర్చించుకోవాలని కూడా అనుకోలేదు.ఆ తర్వాత వంద సార్లు ఎదురుపడి ఉంటాము, ఎంతో మంచిగా మాట్లాడుకున్నాము.ప్రస్తుతం మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, ఎంతో సంతోషం తో ఉన్నాము’ అని మోహన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడాడు.ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఒక్కసారి చిరంజీవి మరియు మోహన్ బాబు కలిస్తే చూడాలని ఉందంటూ సోషల్ మీడియా లో అభిమానులు కొట్టుకుంటున్నారు.