భారతీయుల సహృదయానికి సలాం..: మోడీ

సుప్రీంకోర్టులో జరిగిన అంతర్జాతీయ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ 2020 – ‘జ్యుడిషియరీ అండ్ ది ఛేంజింగ్ వరల్డ్’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడతూ..రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసుతో సహా, కొన్ని కఠినమైన కీలకమైన తీర్పుల విషయంలో న్యాయస్థానం అవలంభించిన తీరును ప్రధాని కొనియాడారు. స్త్రీ-పురుష భేదం లేకుండా ప్రతిఒక్కరికి న్యాయం చేయలేకపోతే ఏ దేశం కూడా సమగ్ర అభివృద్ధిని సాధించలేదని ప్రధాని అన్నారు ఈ నేపథ్యంలో “లింగమార్పిడి, ‘ట్రిపుల్ తలాక్’ మరియు ‘దివ్యాంగ్స్’ […]

  • Written By: Neelambaram
  • Published On:
భారతీయుల సహృదయానికి సలాం..: మోడీ


సుప్రీంకోర్టులో జరిగిన అంతర్జాతీయ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ 2020 – ‘జ్యుడిషియరీ అండ్ ది ఛేంజింగ్ వరల్డ్’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడతూ..రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసుతో సహా, కొన్ని కఠినమైన కీలకమైన తీర్పుల విషయంలో న్యాయస్థానం అవలంభించిన తీరును ప్రధాని కొనియాడారు.

స్త్రీ-పురుష భేదం లేకుండా ప్రతిఒక్కరికి న్యాయం చేయలేకపోతే ఏ దేశం కూడా సమగ్ర అభివృద్ధిని సాధించలేదని ప్రధాని అన్నారు
ఈ నేపథ్యంలో “లింగమార్పిడి, ‘ట్రిపుల్ తలాక్’ మరియు ‘దివ్యాంగ్స్’ (వికలాంగుల) హక్కులపై చట్టాలను ప్రస్తావించారు. అలాగే సైనిక సేవలో మహిళలకు హక్కులు ఇవ్వడం మరియు 26 వారాల పాటు ప్రసూతి సెలవులను మంజూరు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోడీ ప్రశంసించారు.

అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడానికి పర్యావరణ న్యాయ శాస్త్రాన్ని పునర్నిర్వచించినందుకు భారత న్యాయవ్యవస్థను ఆయన ప్రశంసించారు.

టెక్నాలజీ, ఇంటర్నెట్ వాడకంపై మాట్లాడిన మోడీ.. ఇది కోర్టుల విధాన నిర్వహణకు సహాయపడుతుందని, జస్టిస్ డెలివరీ వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

“మారుతున్న కాలంలో, డేటా రక్షణ మరియు సైబర్ నేరాలు వంటి సమస్యలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లను కలిగిస్తాయి” అని ఆయన అన్నారు.

“ఇటీవలి కాలంలో, కొన్ని క్లిష్టమైన న్యాయ తీర్పులు మరియు నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ తీర్పులు ఇవ్వడానికి ముందు, పర్యవసానాల గురించి అనేక భయాలు వ్యక్తయ్యాయి. కానీ ఏమి జరిగిందో చూడండి..130 కోట్లమంది భారతీయులు న్యాయ తీర్పులను హృదయపూర్వకంగా అంగీకరించారు ”అని భారతీయులను ప్రశంసలతో ముంచెత్తారు మోడీ .

సంబంధిత వార్తలు