Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు వెనుక మోదీ, జగన్, కెసిఆర్?
కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు దొరకడం లేదు. ఒక్క కర్ణాటకలో మినహాయిస్తే మిగతా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం నామమాత్రం.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ వెనుక భారీ కుట్ర జరుగుతోందా? ఒక్క జగనే కాదు.. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కెసిఆర్ సైతం దీని వెనుక ఉన్నారా? సోషల్ మీడియాలోఇదే తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీయాలన్న భావనతో ఈ ముగ్గురు ఒక్కటయ్యారన్న టాక్ నడుస్తోంది. వ్యూహాత్మకంగా చంద్రబాబును అణచివేయాలని వారు భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు దొరకడం లేదు. ఒక్క కర్ణాటకలో మినహాయిస్తే మిగతా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం నామమాత్రం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆజ్యం పోసి ఓట్లు, సీట్లు పెంచుకోవాలన్నదే బిజెపి వ్యూహంగా తెలుస్తోంది. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అటు తెలంగాణలో అధికార బి ఆర్ ఎస్ సహకారంతో కాంగ్రెస్ పార్టీని, ఏపీలో అధికార వైసీపీ సాయంతో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీని అచేతనంగా చేస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయవచ్చని బిజెపి ఆలోచన చేస్తోంది. వైసీపీకి కాంగ్రెస్ పార్టీ మాతృక. ఒకవేళ వైసీపీని నిర్వీర్యం చేసినా.. ఆ పార్టీ శ్రేణులు తిరిగి కాంగ్రెస్ లోకి చేరుతాయి. బిజెపి భావజాలం అంటే వారికి పడదు. అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి బిజెపితో జతకట్టేందుకు ఆ పార్టీ శ్రేణులు ఇష్టపడతారు. దాదాపు భావజాలం కూడా ఒక్కటే. అందుకే ఈ లెక్కన ఆలోచన చేసి టిడిపిని దెబ్బతీయాలని బిజెపి అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చి సుదీర్ఘకాలం అవుతున్న నేపథ్యంలో.. తాత్కాలిక ప్రయోజనాల కంటే.. శాశ్వత ప్రయోజనాలకి బిజెపి అగ్రనేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ముందుగా జగన్ ద్వారా చంద్రబాబును అణచివేసి తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
చంద్రబాబు రాజకీయాల గురించి కెసిఆర్ కు తెలియంది కాదు. ప్రస్తుతం తెలంగాణలో తాము అధికారంలో ఉన్నా చంద్రబాబు మనసులను సైతం తమతో కలుపు కి వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి కెసిఆర్ ది. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చంద్రబాబే కారణమని కెసిఆర్ అనుమానిస్తున్నారు. అటు బి ఆర్ ఎస్ లో కొనసాగుతున్న మెజారిటీ నాయకులు, మల్లారెడ్డి, నామా నాగేశ్వరరావు వంటి నాయకులు చంద్రబాబు మనుషులు అన్న అపవాదు ఉంది. చంద్రబాబు కానీ మరోసారి అధికారంలోకి వస్తే.. తనకు రాజకీయంగా ముప్పు తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్, మోడీ సహకారంతో చంద్రబాబుకు ఇబ్బంది పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ పరిస్థితికి ఆ ముగ్గురే కారణమని తెలుగు తమ్ముళ్లు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఎక్కువమంది ఇండియా కూటమి వైపు వెళ్తేనే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఒత్తిడి పెంచుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
