Kavitha CBI Notice : కేసీఆర్ ను కలిశాక కవిత వేసిన స్టెప్ ఇదే
Kavitha CBI Notice : ఓవైపు ఈడీ.. మరోవైపు సీబీఐ తరుముకొస్తున్న వేళ తండ్రి కేసీఆర్ చెంతకు చేరింది ఎమ్మెల్సీ కవిత. ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ ఇల్లు ‘ప్రగతిభవన్ ’కు వచ్చిన కవిత.. సీబీఐ నోటీసులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై చర్చలు జరిపారు. కేసీఆర్ తో మీటింగ్ ముగియగానే ఓ సంచలన స్టెప్ వేశారు. తాజాగా తనకు నోటీసులు పంపిన సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ‘తనకు కంప్లైంట్ కాపీ.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని’ సీబీఐని […]

Kavitha CBI Notice : ఓవైపు ఈడీ.. మరోవైపు సీబీఐ తరుముకొస్తున్న వేళ తండ్రి కేసీఆర్ చెంతకు చేరింది ఎమ్మెల్సీ కవిత. ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ ఇల్లు ‘ప్రగతిభవన్ ’కు వచ్చిన కవిత.. సీబీఐ నోటీసులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై చర్చలు జరిపారు. కేసీఆర్ తో మీటింగ్ ముగియగానే ఓ సంచలన స్టెప్ వేశారు.
తాజాగా తనకు నోటీసులు పంపిన సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ‘తనకు కంప్లైంట్ కాపీ.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని’ సీబీఐని కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్ లో విచారణ తేది ఖరారు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు.
దీన్ని బట్టి తనపై ఏ కేసు పెట్టారు? అందులోని లొసుగులను తెలుసుకొని జాగ్రత్త పడాలని.. కోర్టులో ఎదుర్కోవాలని కవిత ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీని కేసీఆర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తెలిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఆధారాలు దొరక్కకుండా కోర్టుల్లో బలమైన వాదనతో నీరుగారిపోయేలా చేయవచ్చని కవిత , కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందంటూ శుక్రవారం ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో కానీ.. ఢిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి అంటూ సీబీఐ పంపిన నోటీసుల్లో పేర్కొంది. దీంతో దీనికి సమాధానం ఇచ్చిన కవిత.. తనకు ముందు కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలని కోరింది. ఈ కేసులో సీబీఐ ఎలా ముందుకెళుతుందో తెలుసుకొని జాగ్రత్తపడేందుకు కవిత వ్యూహాత్మకంగా ఈ లేఖలో కోరినట్టు తెలుస్తోంది.
