MLC Kavitha- CBI: అనుకున్నదే అయింది.. సిబిఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత డుమ్మా కొట్టింది. సిబిఐ ఎఫ్ ఐఆర్ లో తన పేరు లేకపోవడంతో ఆరో తేదీన విచారణకు రాలేనని కవిత తేల్చి చెప్పింది. ఆరో తేదీన ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున తాను విచారణకు రాలేనని, 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సిబిఐ అధికారులకు వివరించింది. “సిబిఐ తన వెబ్ సైట్ లో పొందు పరిచిన ఎఫ్ ఐ ఆర్ ను క్షుణ్ణంగా పరిశీలించాను..అందులో ఎక్కడా నా పేరు లేదు. ఆ విషయాన్ని తెలియ జేస్తున్నాను.” అంటూ సీబీఐ కి లేఖ రాసింది.. అయితే ఈ కేసులో సందేహాల నివృతి కోసం సిబిఐకి కవిత ఒక లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు, దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తనకు అందించాలని కవిత ఇటీవల సిబిఐ ని కోరారు. అయితే దీనికి స్పందించిన సిబిఐ అధికారులు ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చారు . ఎఫ్ఐ ఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉందని తెలిపారు. అందులో ఉన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను కవిత పరిశీలించారు.. అందులో ఎక్కడా కూడా తన పేరు లేకపోవడంతో తాను విచారణకు హాజరు కాలేనని సిబిఐ అధికారి రాఘవేంద్ర వస్త కు లేఖ రాశారు. పలు కార్యక్రమాలు ముందే ఖరారై ఉన్నందున 11,12, 14, 15 తేదీలలో అనువైన ఒక రోజు హైదరాబాదులోని తన నివాసంలో విచారణకు సిద్ధంగా ఉంటానని కవిత పేర్కొన్నారు. త్వరగా తేదీ ఖరారు చేయాలని సిబిఐ అధికారులను కోరారు.

MLC Kavitha- CBI
సీఎం సమావేశనంతరం మారిన సీన్
ఈడీ ఛార్జ్ షీట్ లో పేరు ప్రస్తావించింది.. విచారణ చేస్తామని సిబిఐ లేఖ పంపింది. దీంతో కవిత ఆగ్రహ రూపం దాల్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసింది. తన ఇంటికి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి “జైల్లో వేస్తారు అంతే కానీ ఉరి తీయరు” కదా అంటూ గాంభీర్యపు మాటలు మాట్లాడింది. విషయం తీవ్రత గుర్తించిన ముఖ్యమంత్రి కవితకు కబురు పంపారు. దీంతో ఆమె మరుసటి రోజు ఉదయం ప్రగతి భవన్ వెళ్లారు. సాయంత్రం దాకా అక్కడే ఉన్నారు. సీఎం రంగంలోకి దిగిన నేపథ్యంలో.. చాలామంది న్యాయ కోవిదులు ప్రగతి భవన్ వెళ్లారు. చాలాసేపు అక్కడ చర్చలు జరిపారు. అవి సాయంత్రం దాకా ఒక కొలిక్కి రాలేదు.. అయితే హైకోర్టులో పని చేసే వెలమ సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ న్యాయవాది సూచనతో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. వెంటనే కవిత దానిని అమలులో పెట్టారు.
ఏం చేశారంటే
ఎప్పుడైతే కెసిఆర్ ఆదేశించారో అప్పుడే కవిత మరింత యాక్టివ్ అయ్యారు. వెంటనే తన స్వరాన్ని మార్చారు. సిబిఐ విచారణ కు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఇక్కడ తెలివిగా సిబిఐ ఢిల్లీ లేదా హైదరాబాద్లో విచారణకు ఏదో ఒకదానిని ఎంచుకోమని ఆప్షన్లు ఇచ్చింది.. అయితే ఇక్కడే కవిత పప్పులో కాలేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు జనరల్ కాన్సెంట్ ను ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో.. హైదరాబాద్ ను ఎంచుకున్నది.

MLC Kavitha- CBI
దీనివల్ల సిబిఐ అధికారులు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం లభించింది. అయితే ఈ విషయంలో కెసిఆర్ కలుగజేసుకోవడంతో.. ఈ కేసు పూర్వా పరాలు తనకు తెలియజేయాలని సిబిఐ అధికారులను కవిత కోరింది. ఆమె కోరిన నేపథ్యంలో సిబిఐ అధికారులు కేసుకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ కాపీని వెబ్ సైట్ లో ఉంచారు. ఇందులో తన పేరు లేకపోవడంతో తాను ఆరో తేదీన విచారణకు రాలేనని కవిత స్పష్టం చేసింది. అయితే కేసీఆర్ ఒక్క నిర్ణయంతో ఈ కేసు సీన్ మారిపోయింది. కవిత లేఖ నేపథ్యంలో సిబిఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.