MLAs retirement – Successors Ticket : రిటైర్ మెంట్ హెచ్చరికలు.. జగన్ మైండ్ బ్లాంక్
ఇప్పుడు ఏకంగా బ్లాక్ మెయిల్ తరహాలో నాని మాట్లాడారు. ఇది ఒక్కనానితో పోదని.. సీనియర్లంతా ఇదే మాదిరిగా మాట్లాడతారని.. అందుకే చాన్స్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

MLAs retirement – Successors Ticket : వైసీపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా టైమ్ చూసి సీనియర్లు తమ ప్రతాపం చూపుతున్నారు. తమ వారసులకు టిక్కెట్లు ఇస్తారా? లేదా? అని గట్టిగానే అడుగుతున్నారు. అందుకు రిటైర్మెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. తాము వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తమ వారసులకు ఆ చాన్సివ్వాలని కోరుతున్నారు. దీంతో సీనియర్ల కొత్త ఎత్తుగడతో జగన్ మైండ్ బ్లాక్ అవుతోంది. లోలోల ఆగ్రహిస్తున్న అధినేత.. మారిన రాజకీయ పరిస్థితులతో సముదాయించుకుంటున్నారు. చిరు నవ్వుతోనే సరిపెడుతున్నారు.
వైసీపీలో ఆరు పదులు దాటిన ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చే ఎన్నికల్లో వారసులను బరిలో దించాలని భావిస్తున్నారు. కానీ ఈసారి ఫైట్ మామ్మూలుగా జరిగే అవకాశం లేకపోవడంతో అధినేత ఎక్కడా సమ్మతించడం లేదు. ఇప్పటివరకూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక్కరికే అ అవకాశం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తాను మీ వెంట ఉండిపోతానని భాస్కరరెడ్డి చెప్పడంతో జగన్ కొంత అంగీకరించినట్టు తెలుస్తోంది. తన టీమ్ లో భాస్కరరెడ్డి ఉండక అనివార్య పరిస్థితి తలెత్తడంతో అక్కడ ఆయన కుమారుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ.. చిత్తూరు నుంచి అనంతపురం వరకూ నేతల వారసులకు టిక్కెట్లు ఇవ్వాలంటే… కనీసం 50 మందికైనా ఇవ్వాలి. అలాగని సీనియర్లను తప్పిస్తే కేడర్ సహకారం అంతంతమాత్రంగానే ఉంటుందని నివేదికలు అందుతున్నాయి. పైగా ఒక్కరికి అనుమతిచ్చినా మిగతా సీనియర్లు అదే డిమాండ్ తో చెలరేగిపోయే అవకాశం ఉంది. అందుకే జగన్ సైతం అచీతూచీ వ్యవహరిస్తున్నారు. కానీ కొందరు సీనియర్లు మొండి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా అధినేతను కమిట్ చేయాలని చూస్తున్నారు.
బందరు పోర్టు శంకుస్థాపన సభలో సైతం జగన్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. తనకు సన్నిహితుడిగా భావిస్తున్న పేర్ని నాని వింత ప్రవర్తనతో అధినేతకు విస్తుగొల్పారు. స్థానిక శాసనసభ్యుడిగా మాట్లాడే క్రమంలో… ఇక ప్రసంగాన్ని ఆపేయాలని స్టేజ్ పై ఉన్న ఓ వ్యక్తి ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన నువ్వు ఎంత గిల్లినా నేను తగ్గబోనని… మాట్లాడి తీరుతానని అన్నారు. రిటైర్ అవుతున్నానంటూ ప్రకటించేశారు. దీంతో పేర్ని నానితో బలవంతపు రిటైర్మెంట్ ప్రకటింప చేశారన్న అభిప్రాయం వైసీపీలో ఎక్కువగా వినిపిస్తోంది.గత కొద్దిరోజులుగా ఆయన కుమారుడికి చాన్సివ్వాలని నాని కోరుతున్నారు. అందుకు జగన్ నో చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా బ్లాక్ మెయిల్ తరహాలో నాని మాట్లాడారు. ఇది ఒక్కనానితో పోదని.. సీనియర్లంతా ఇదే మాదిరిగా మాట్లాడతారని.. అందుకే చాన్స్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.