MLA Silpa Chakrapani Vs Nara Lokesh: నారా లోకేష్ తో పెట్టుకున్న ఆ వైసీపీ ఎమ్మెల్యే.. రచ్చ రచ్చే
చంద్రబాబును అడిగితే తన గురించి చెబుతారని లోకేష్ ను ఉద్దేశించి చక్రపాణి అన్నారు. సొంత నిధులతో దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత తనదని అన్నారు.

MLA Silpa Chakrapani Vs Nara Lokesh: రాయలసీమలో కొనసాగుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ‘సవాల్’లు ఎదురవుతున్నాయి. ఆయన పాదయాత్ర చేపట్టిన, చేపడుతున్న నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలను అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు నుంచి అంతే గట్టిగా ప్రతిస్పందన ఉండటంతో రాజకీయంగా ఉత్కంఠత రేపుతున్నది. కర్నూలు జిల్లాలో లోకేష్ వందవ రోజు పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా లోకేష్ చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి చేసి వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి.
నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిపై తీవ్ర విమర్శలు చేశారు. భూ కబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి కమీషన్ల దందాలు, చివరకు దేవుడిని కూడా వదల్లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి శ్రీశైలం దేవస్థానాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే చక్రపాణి స్పందించారు. తనను చీటింగ్ చక్రపాణి అని పేరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని విమర్శించారు. మీ చీటింగ్ స్కూల్లో 6 యేళ్ల పాటు చదువుకున్నారని ఎత్తిపొడిచారు. చీటింగ్ చేసే వ్యక్తినే అయితే జిల్లా, రాష్ట్ర పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
చంద్రబాబును అడిగితే తన గురించి చెబుతారని లోకేష్ ను ఉద్దేశించి చక్రపాణి అన్నారు. సొంత నిధులతో దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత తనదని అన్నారు. సొంత బంధువులకు టిక్కెట్లు ఇప్పిస్తున్నట్లు ఆరోపించావ్.. అచ్చెన్నాయుడు ఆలయానికి వచ్చినప్పుడు టిక్కెట్లు కొని పంపింన విషయం నీకు(లోకేష్) తెలుసా అని ప్రశ్నించారు.
2014, 2019లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేపోయారని మండిపడ్డారు. తనపై ఆరోపణలో రుజవు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. దమ్ముంటే మహానందికి వచ్చి ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. లోకేష్ అనంతపురం జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలోను వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు చేస్తూనే ఉన్నారు. లోకేష్ విమర్శలపై తీవ్రంగా మండిపడుతున్నారు. గెలవలేని పార్టీకి ఇన్ని ఆర్భాటాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరుగుతున్న రాజకీయ సవాళ్లు ఎలా రూపాంతరం చెందుతాయో వేచి చూద్దాం.
