Mission Impossible 7 Review: మిషన్ ఇంపాజిబుల్ 7 రివ్యూ
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్లో అన్నింటిలో ఒకటే కథ. హీరో ఈథన్(టామ్ క్రూజ్) తన టీమ్ ఇల్సా ఫౌస్ట్ (రెబెక్కా ఫెర్గూసన్), లూథర్ స్టికెల్ (వింగ్ రేమ్స్), బెంజి డన్ (సైమన్ పెగ్) లతో ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును ఎలా తొలగిస్తాడు. అనితర సాధ్యమైన ఒక డెడ్లీ మిషన్ ని ఎలా పూర్తి చేస్తాడనేదే కథ. మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రాకింగ్ పార్ట్ 1 కథ కూడా అలాంటిదే.

Mission Impossible 7 Review: కొన్ని హాలీవుడ్ ప్రాంచైజీస్ కి ఇండియాలో భారీ డిమాండ్ ఉంది. స్పైడర్ మాన్, టెర్మినేటర్, బ్యాట్ మాన్, అవతార్, అవెంజర్స్ వంటి హాలీవుడ్ చిత్రాల సీక్వెల్స్ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. వాటిలో మిషన్ ఇంపాజిబుల్ ఒకటి. అమెరికన్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ తెచ్చిపెట్టిన ఫ్రాంచైజీగా మిషన్ ఇంపాజిబుల్ ఉంది. యాక్షన్ చిత్రాల్లో మిషన్ ఇంపాజిబుల్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. మిషన్ ఇంపాజిబుల్ 7 యాక్షన్ ప్రియులను మైమరిపించేందుకు థియేటర్స్ లోకి వచ్చేసింది. జులై 12న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇండియాలో కూడా మిషన్ ఇంపాజిబుల్ 7 ప్రీమియర్స్ ముగిశాయి.
కథ:
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్లో అన్నింటిలో ఒకటే కథ. హీరో ఈథన్(టామ్ క్రూజ్) తన టీమ్ ఇల్సా ఫౌస్ట్ (రెబెక్కా ఫెర్గూసన్), లూథర్ స్టికెల్ (వింగ్ రేమ్స్), బెంజి డన్ (సైమన్ పెగ్) లతో ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును ఎలా తొలగిస్తాడు. అనితర సాధ్యమైన ఒక డెడ్లీ మిషన్ ని ఎలా పూర్తి చేస్తాడనేదే కథ. మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రాకింగ్ పార్ట్ 1 కథ కూడా అలాంటిదే.
విశ్లేషణ:
యాక్షన్ చిత్రాలకు కథతో సంబంధం ఉండదు. సినిమా ఆద్యంతం రోలర్ కోస్టర్ రైడ్ లా సాగాలని కోరుకుంటారు. ఆ విషయంలో మిషన్ ఇంపాజిబుల్ 7 గత చిత్రాలకు డబల్ ఉందని చెప్పొచ్చు. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్. క్లైమాక్స్ తో పాటు ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటుంది.
అరవై ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన లుక్ యంగ్ అండ్ ఫిట్ గా ఉంది. డూప్ లేకుండా టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్ చేశారు. లోయలోకి బైక్ జంప్ చేసి టామ్ క్రూజ్ ప్యారాషూట్ సహాయంతో దిగుతాడు. ఇది ప్రాణాలకు తెగించి చేసిన స్టంట్. ఈథన్ అండ్ టీమ్ సంభాషణలు చాలా ప్రత్యేకం.
అయితే మిషన్ ఇంపాజిబుల్ 7లో విలన్ కనిపించదు. కనిపించని శత్రువుతో హీరో ఫైట్ చేస్తాడు. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంది. అందులో రివీల్ చేయనున్నారు. విలన్ ఒక డిజిటల్ థ్రెట్ అని తెలుస్తుంది. సీక్వెల్ కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చారు. దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్లో బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించారు.
ప్లస్ పాయింట్స్:
టామ్ క్రూజ్ ప్రెజెన్స్
యాక్షన్ సీక్వెన్సెస్
విజువల్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
విలన్ ప్రెజెన్స్ లేకపోవడం
ఇతర చిత్రాలతో పోలికలు
చూడాలా? వద్దా?:
మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రాకింగ్ పార్ట్ 1 బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ తరహా చిత్రాలను ఇష్టపడే వాళ్లకు ఐ ఫీస్ట్. టామ్ క్రూజ్ సాహసాలు ఆకాశంలో తేలేలా చేస్తాయి. ఈ వీకెండ్ కి బెస్ట్ ఛాయిస్.
రేటింగ్:3.5/5
