Miss Shetty Mr Polishetty Teaser : మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ రివ్యూ..అనుష్క – నవీన్ పోలిశెట్టి మధ్య కెమిస్ట్రీ అదుర్స్

అనుష్క ఒక సీనియర్ మోస్ట్ చెఫ్ గా ఉంటూ , ఒక రెస్టారంట్ ని రన్ చేస్తూ ఉంటుంది. ఇక హీరో నవీన్ పోలిశెట్టి ఉద్యోగం లేకుండా తిరిగే ఒక ఆవారా లాంటి వాడు,

  • Written By: NARESH ENNAM
  • Published On:
Miss Shetty Mr Polishetty Teaser : మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ రివ్యూ..అనుష్క – నవీన్ పోలిశెట్టి మధ్య కెమిస్ట్రీ అదుర్స్

Miss Shetty Mr Polishetty Teaser : ‘భాగమతి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనుష్క వెండితెర మీద మరో సినిమాలో కనిపించలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం కూడా డైరెక్టుగా ఓటీటీ లోనే విడుదల అయ్యింది.దీంతో అనుష్క ఫ్యాన్స్ ఎప్పటి నుండో తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఆ సమయం లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాని ప్రకటించారు.

ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరో గా నటించాడు. ‘జాతి రత్నాలు’ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేసారు. సాయంత్రం ఆరు గంటలకే విడుదల చేస్తామని చెప్పారు కానీ, కొన్ని టెక్నికల్ ఇబ్బందుల కారణం గా కాసేపటి క్రితమే విడుదలైంది.ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.

ఈ టీజర్ ని చూసిన తర్వాత అర్థం అయ్యింది ఏమిటంటే ఇందులో అనుష్క ఒక సీనియర్ మోస్ట్ చెఫ్ గా ఉంటూ , ఒక రెస్టారంట్ ని రన్ చేస్తూ ఉంటుంది. ఇక హీరో నవీన్ పోలిశెట్టి ఉద్యోగం లేకుండా తిరిగే ఒక ఆవారా లాంటి వాడు, ఆన్లైన్ లో స్టాక్ మార్కెట్ మరియు క్రిప్టో కరెన్సీ వంటి వాటిపైన డబ్బులను తగలేస్తూ ఉంటాడు.అలాంటి వ్యక్తి ఇంట్లో వాళ్ళు పెడుతున్న వత్తిడిని తట్టుకోలేక ఎదో ఒక జాబ్ లో చేరుదామని, అనుష్క రన్ చేస్తున్న రెస్టారంట్ లో చెఫ్ గా చేరడానికి వస్తాడు.

అనుష్క అతనిని ఇంటర్వ్యూ చెయ్యడం వంటివి ఈ టీజర్ లో మనం గమనించొచ్చు. నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో వేసిన పంచులు నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూస్తూ ఉంటే కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేలాగానే ఉంది, రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇంకెంత అంచనాలను రేపుతుందో చూడాలి.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు