Anshu Malika: మినిస్టర్ రోజా కూతుర్ని చూశారా ఎంత అందంగా ఉందో… సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమా!
బుల్లితెర మీద కూడా ఆమె హవా నడించింది. సీరియల్స్ తో పాటు షోలలో సందడి చేశారు. ఇక 2013లో మొదలైన జబర్దస్త్ షో జడ్జిగా ఆమె చెరగని ముద్ర వేశారు.

Anshu Malika: 90లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది రోజా. రాజేంద్ర ప్రసాద్ హీరోగా 1991లో విడుదలైన ప్రేమ తపస్సు చిత్రంలో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ చిత్రాలు చేసిన రోజా మలయాళ, కన్నడలో కూడా నటించారు. కెరీర్లో 200 చిత్రాల వరకూ ఆమె నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో ఆమె జతకట్టారు. పలు బ్లాక్ బస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.
బుల్లితెర మీద కూడా ఆమె హవా నడించింది. సీరియల్స్ తో పాటు షోలలో సందడి చేశారు. ఇక 2013లో మొదలైన జబర్దస్త్ షో జడ్జిగా ఆమె చెరగని ముద్ర వేశారు. ఏళ్ల తరబడి లెజెండరీ కామెడీ జడ్జిగా ఆమె వ్యవహరించారు. వైసీపీ పార్టీలో చేరాక ఆమె వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం టూరిజం మినిస్టర్ గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. రోజా దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అమ్మాయి పేరు అన్షు మాలిక.
20వ ఏట అడుగుపెట్టిన అన్షు మాలిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇంస్టాగ్రామ్ లో ఆమెను లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒడ్డు పొడుగు అందంలో అచ్చు అమ్మ పోలికే. అన్షు మాలిక హీరోయిన్ మెటీరియల్ అనడంలో సందేహం లేదు. అన్షు మాలికను చూసిన పలువురు ఇదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అన్షు మాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు చాలా కాలంగా ప్రచారం అవుతుంది.
తన కూతురు హీరోయిన్ కావాలనుకుంటే కచ్చితంగా ప్రోత్సహిస్తానని రోజా ఓ సందర్భంలో చెప్పారు. పిల్లల అభిరుచులు, ఆకాంక్షలను మనం గౌరవించాలని రోజా అంటున్నారు. ఒకప్పటి హీరోయిన్ గా తన కూతురు హీరోయిన్ అయితే సంతోషమే అంటుంది. ప్రస్తుతం అన్షు మాలిక విదేశాల్లో చదువుకుంటున్నట్లు సమాచారం. చదువు పూర్తి అయ్యాక అన్షు మాలిక హీరోయిన్ అయ్యే అవకాశం కలదు.
View this post on Instagram
