Minister KTR Tours: కేటీఆర్ అంటే ఎవరు? కెసిఆర్ కొడుకు. ఇది మొన్నటిదాకా వినిపించిన మాట. మరి ఇప్పుడు.. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు. సిరిసిల్ల ఎమ్మెల్యే, పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి. అన్నింటికన్నా షాడో ముఖ్యమంత్రి. సీఎంవో నుంచి కలెక్టర్ ల దాకా అన్ని రంగాలను, అన్ని వ్యవస్థలను శా శిస్తున్న వ్యక్తి. అంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి ఇప్పుడు జిల్లాల్లో ఎందుకు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు? ఎందుకు ప్రతిపక్ష నేతల పై గతంలోకంటే భిన్నంగా వివాదాస్పదంగా విమర్శలు చేస్తున్నారు? పట్టణ ప్రగతి కార్యక్రమం నుంచి దావోస్ పెట్టుబడుల సదస్సు దాకా.. ట్విట్టర్ లో ట్వీట్ల నుంచి బిజెపి కాంగ్రెస్ నాయకుల మీద విమర్శల దాకా.. అంతా ఆయనే.. అన్నింటా ఆయనే. ఆయన విస్తృతంగా తిరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఈ స్థాయిలో పర్యటనలు చేసేవారు. ఇంతకీ తెలంగాణలో ఆ స్థాయిలో కేటీఆర్ ఎందుకు పర్యటనలు చేస్తున్నట్టు?

Minister KTR
సుడిగాలి పర్యటన చేస్తున్నారు
కేటీఆర్ కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం మొత్తం తిడుతున్నారు. దేశ విదేశాల్లో సైతం పర్యటిస్తున్నారు. దిగ్గజ కంపెనీల సీఈవో లను కలుస్తున్నారు. ముఖ్యంగా ఐటిఐ సెక్రెటరీ జయేష్ రంజన్ ను వెంటబెట్టుకొని కేటీఆర్ చేపడుతున్న పర్యటనలో రాజకీయ వర్గాల్లోనే కాదు పారిశ్రామిక వర్గాల్లో సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో ఈ స్థాయిలో పర్యటించిన కేటీఆర్ అకస్మాత్తుగా తన పంథాను ఎందుకు మార్చారు?
Also Read: AP BJP- Chandrababu: ఏపీలో బీజేపీ సరికొత్త గేమ్.. చంద్రబాబుకు ఇక చెడుగుడే
కోల్పోతున్న పట్టును సాధించేందుకేనా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో పార్టీకి కేసీఆరే అన్ని. 2018 ఎన్నికల తర్వాత తాను దేశ రాజకీయాల్లోకి వెళతాను అని కెసిఆర్ నర్మగర్భంగా చెప్పారు. అందుకే కేటీఆర్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే కేటీఆర్ ను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. దీనికితోడు పురపాలక శాఖ, ఐటి, పరిశ్రమలు ఇలా కీలక బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆశించిన మేర సీట్లు సాధించకపోవడం, దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో పరాభవాన్ని మూటకట్టుకోవడంతో ప్రజల్లో తమ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కేటీఆర్ గ్రహించు కున్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో ఒక్కసారిగా మేల్కొన్నారు. ఇది ఇలాగే ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన కేటీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. వెంటనే 33 జిల్లాలకు అధ్యక్షులను, కార్యదర్శులను నియమించారు. ఇందులో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో తన అనుయాయులను ఎంపిక చేసుకున్నారు. ఉత్తర తెలంగాణలో సింహభాగం తన వారికే పదవులు ఇప్పించు కున్నారు. ఎలాగూ సీఎం పదవి చేపట్టాలని ఆశతో ఉన్న నేపథ్యంలో ముందుగానే కేటీఆర్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

Minister KTR
విమర్శలు అందులో భాగమే
ఈమధ్య కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా బిజెపి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సభలు సమావేశాల్లో సైతం వదలడం లేదు. మరోవైపు వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు ను కలవడం ద్వారా తాను తెలంగాణకు భవిష్యత్తు ఆశాకిరణం గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల బెంగళూరులో రాకేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ తో వేల కోట్ల డీల్ కుదుర్చుకున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, తెలంగాణ కోసం ఎందాకైనా వెళ్తానని చెప్పకనే చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ కొత్తగా తీసుకువచ్చింది ఏమీ లేదని, గతంలో ఉన్న పారిశ్రామిక విధానాలను ఇప్పుడూ అమలు చేస్తున్నానరని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు వెనకడుగు వేస్తున్నారు. వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇవాళ ఖమ్మం లో బిజెపి కార్యకర్త సాయి గణేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని లేపింది. ఈ క్రమంలో తనకు అత్యంత సన్నిహితుడైన పువ్వాడ అజయ్ కుమార్ కు సైతం క్లాస్ పీకారు. సాయి గణేష్ ఆత్మహత్య ఖమ్మం లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో తన పర్యటనను పలుమార్లు వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ఉద్రిక్తలు చల్లారాక ఖమ్మం లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అందులోని వామపక్ష పార్టీల కార్పొరేటర్లతోనూ వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి ఖమ్మం ప్రజల మనసుల్లో మంచి మార్కులు కొట్టాలని ప్రయత్నించారు.
అనుయాయులు వివాదాస్పదమవుతున్నరు
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. కేటీఆర్ ఒకటి అనుకుంటే క్షేత్రస్థాయిలో మరొకటి అవుతున్నది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. బాచుపల్లి మమత వైద్య కళాశాల నుంచి పలు వ్యాపారాలు ఇద్దరికీ భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇటీవల పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న పనులన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. వీటి వల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తోంది. సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో కేటీఆర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాల్క సుమన్, క్రిషాంక్, జగన్మోహన్రావు, సతీష్ రెడ్డి కూడా పలు విషయాలలో తలదూర్చడం కేటీఆర్కు తలనొప్పి తెచ్చిపెడుతోంది.
భావి సీఎం అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారా?
2018 ఎన్నికల ఫలితాలు మొదలు ఇప్పటివరకు కేటీఆర్ ను సీఎం చేస్తారనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే ఒకప్పటి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, టిఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరయిన ఈటెల రాజేందర్ గులాబీ జెండా కు ఓనర్ల మేమే అని పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. దీంతో ఈటల రాజేందర్ ను పొమ్మనలేక పొగ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ లో కేటీఆర్ మాటకు ఎదురు లేదు. అతడికి కేటాయించిన శాఖలే కాకుండా మిగతా శాఖల్లోనూ కేటీఆర్ వేలు పెడుతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన అతివలకు పురస్కారాలు పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా కేటీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే అతనికి ఎంత విలువ ఇస్తున్నారో అతని ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ మైనర్ పై జరిగిన అత్యాచార ఘటన లో కేటీఆర్ ఆదేశాలు ఇస్తే తప్ప హోం శాఖ మంత్రి, డిజిపి చర్యలు తీసుకొని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే కేటీఆర్ ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే గమనించవచ్చు. ప్రస్తుతం తెలంగాణవాదానికి రోజులు జిల్లా కనుక, రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది కనుక, అర్బన్ ప్రాంతాల్లో బిజెపి పుంజుకుంటోంది కనుక, క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది కనుక కేటీఆర్ విస్తృతంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే బిజెపి, కాంగ్రెస్ నాయకుల పై స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. ఒకసారి కేటీఆర్ చేస్తున్న ట్వీట్లు కానీ, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ చాలా వివాదాస్పదం అవుతున్నాయి.మొన్న యూపీలో జరిగిన వరదల ఘటనపై ఒక వీడియో పోస్ట్ చేయగా, మల్కాజ్గిరి లో నాలాలో ఒక బాలిక కొట్టుకుపోయిన ఘటన పై కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను ఉదహరిస్తున్నారు.
Also Read:Chandrababu-NTR Family: ఏకతాటిపై ఎన్టీఆర్ కుటుంబం.. ఆ ఒక్కరు తప్ప.. చంద్రబాబు భారీ స్కెచ్