
Minister KTR
Minister KTR: అధికారం ఉందని విర్ర వీగొద్దు.. అధికారం శాశ్వతం కాదు.. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు.. ప్రజా తీర్పే అంతిమం.. పదవి ఉందని ఇష్టానుసారం మాట్లాడితే అనుభవించక తప్పదు. ఇవ్వన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలియని విషయాలు కావు. కానీ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామిక పాలనను ప్రశ్నిస్తున్న వారిపైనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇప్పటికే మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకున్న కల్పకుంట్ల ఫ్యామిలీ.. ఇప్పుడు మీడియాను బెదిరించే స్థాయికి దిగజారారు.
బాధ్యత ఉంది అంటూనే ఏం బాధ్యత అని ప్రశ్న..
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ పరీక్షల రద్దు పై విపక్షాల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు టీఎస్పీఎస్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ముగ్గురు నలుగురు మంత్రులతో శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రశ్న పత్రం లీకేజీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా యువతలో నిరుద్యోగుల్లో ధైర్యం నింపాల్సింది పోయి ఎదురు దాడి మొదలుపెట్టారు. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలని తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు బాధ్యత ఉందని పేర్కొన్నారు. తర్వాత మీడియా ప్రతినిధులు అడిగినా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీలో నియామకాల గురించి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ అసహనానికి గురయ్యారు. కనీస అర్హతలేని వారిని ఎలా నియమిస్తారని అడిగినందుకు నీకేం బాధ్యత అంటూ ఎదురు దాడి చేశారు. మమ్మల్ని గెలిపించారు మాకు బాధ్యత తెలియదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మాకు బాధ్యత ఉందన్న మీడియా ప్రతినిధిపై మండిపడ్డారు. ఓకే మీడియా సమావేశంలో కెసిఆర్ వ్యవహరించిన తీరు పై ఇప్పుడు సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Minister KTR
తండ్రిలాగే.. తనయుడు..
ముఖ్యమంత్రి కేసీఆర్.. కూడా మీడియా సమావేశంలో తనకు నచ్చని ప్రశ్నలు అడిగిన వారిపై చేసేవారు. నీకేం తెలుసు ఎదురు ప్రశ్నించేవారు. ఇప్పుడు ఆయన తనయుడు కేటీఆర్ కూడా అదే పంథాలో పోతున్నారు. తప్పిదాలను ప్రశ్నిస్తే అసహనానికి గురవుతున్నారు. తమకు అవసరమైనప్పుడు మాత్రం మీడియా కావాలనుకునే నేతలు ప్రజల అవసరాలను.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అన్న అభిప్రాయం జర్నలిస్టుల్లో వ్యక్తం అవుతుంది.