Microsoft : ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం మరీ.. జీతాలు భారీ స్థాయిలోనే ఉంటాయి. కానీ వారి సంక్షేమాన్ని ఆలోచించిన మన తెలుగు వాడు, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల వేతనాలను డబుల్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా సీఈవో సత్య నాదెళ్ల ఈమెయిల్ ద్వారా సంస్థ ఉద్యోగులకు తెలియజేశారు.
కరోనా కల్లోలం తర్వాత జీతాలు ఎక్కడ ఎక్కువిస్తే అక్కడికి నిపుణులైన ఉద్యోగులు వలస వెళుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలను అందుకే భారీగా పెంచుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల స్పష్టం చేశారు.
గ్లోబల్ మెరిట్ బడ్జెట్ ను ఇందుకోసం రెండింతలు చేశామని..తమ కెరీర్ మధ్యలో ఉన్న వారికి వేతన పెంపు భారీగా ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో సత్యనాదెళ్ల తెలిపారు. నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.
ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల జీతాలను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లుసత్య నాదెళ్ల తెలిపారు. అదే సమయంలో మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఇతర ఉన్నతాధికారుల జీతాలు దాదాపు 25శాతం పెరుగనున్నాయి. ఇతరులు మరింత ఇంక్రిమెంట్లు పొందుతారు. తమ కెరీర్ ప్రారంభ, మధ్యదశల్లో ఉన్నవారు వేతనాల పెంపుతో ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఒక ప్రకటనలో తెలిపారు.